English | Telugu

కొత్త కెప్టెన్ గా ప్రియాంక.. ఏడ్చేసిన అమర్ దీప్!

బిగ్ బాస్ సీజన్-7 ఇప్పటికే పది వారాలు పూర్తి చేసుకుంది‌. గతవారం భోలే షావలి ఎలిమినేట్ అవ్వగా ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనే ఆసక్తి అందరిలోను నెలకొంది‌.

ఈ సీజన్ లో ఎన్నో ట్విస్ట్ లు ఇస్తున్నాడు బిగ్ బాస్. గత వారం ఫ్యామిలీ వీక్ అవ్వడంతో ఈ షో అత్యధిక టీఆర్పీ నమోదు చేసుకుంది. ఈ వారం ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం కంటెస్టెంట్స్ మధ్య ఎన్నో టాస్క్ లని ఇచ్చాడు బిగ్ బాస్. చివరగా యావర్ ఎవిక్షన్ ఫ్రీ పాస్ ని సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత కెప్టెన్సీ పోటీ కోసం కంటెస్టెంట్స్ కి సరికొత్త టాస్క్ ని ఇచ్చాడు బిగ్ బాస్. అయితే ఈ టాస్క్ లలో కంటెస్టెంట్స్ మధ్య తీవ్రమైన ఆర్గుమెంట్స్ జరిగాయి.

ఒకవైపు ఉన్న బ్రిక్స్ ని మరోవైపు తీసుకెళ్ళాలని వాటిని కాలు కింద పెట్టకుండా తీసుకురావాలని బిగ్ బాస్ చెప్పాడు. ఇందులో అందరు కంటెస్టెంట్స్ పోటీ పడగా.. రతిక మొదటగా అవుట్ అవ్వగా, సెకండ్ గౌతమ్ బయటకొచ్చేశాడు. ఆ తర్వాత అశ్వినిశ్రీ, శోభాశెట్టి, శివాజీ అవుట్ అయ్యారు. ఇక చివరగా ప్రశాంత్, అంబటి అర్జున్, అమర్ దీప్, ప్రియాంక ఉండగా.. హౌస్ మేట్స్ అందరు కలిసి ప్రశాంత్, అంబటి అర్జున్ ని టార్గెట్ చేసి బయటకు పంపించేశారు. అమర్ దీప్, ప్రియంక మిగిలారు.

గౌతమ్ కృష్ణ, రతిక ఇద్దరు కలిసి అమర్ దీప్ ని టార్గెట్ చేశారు. బాల్స్ తో అమర్ దీప్ బ్రిక్స్ ఉన్న టవర్ ని పడగొడుతుంటే.. అరెయ్ ప్లీజ్ రా వద్దురా, వదిలేయ్ రా అంటూ ఏడ్చేశాడు అమర్ దీప్. ఇక మిగిలిన హౌస్ మేట్స్ అంతా ఏడ్వకు, డిఫెండ్ చేసుకో అని చెప్పారు. ఇక గేమ్ ఆడుతున్నంతసేపు అమర్ దీప్ ఏడ్చేశాడు. టాస్క్ ముగిసే సమయానికి ప్రియంక బ్రిక్స్ తో చేసిన టవర్ ఎక్కువగా ఉండటంతో ప్రియాంక గెలిచింది. అమర్‌దీప్ ఓటమిని భరించలేక ఏడ్చేశాడు. మొత్తానికి టాస్క్ గెలిచి ప్రియంక ఈ వారం కెప్టెన్ గా నిలిచింది.