English | Telugu
Krishna Mukunda Murari: భవాని పట్టుదల ముందు కృష్ణ ప్రేమ నిలబడుతుందా?
Updated : Nov 17, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి '. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -317 లో.. మురారి కృష్ణ బాధపడుతు రావడం చూసి తను కూడా బాధపడతాడు. ఇక కోపంగా ముకుంద చేసిన తప్పుకి తనపై అరుస్తాడు. ఆ తర్వాత మురారిని కూల్ చెయ్యాలని ముకుంద కృష్ణకోసం చీర తీసుకొని వెళ్లి ఇవ్వు అని అనగానే.. ఇంకొకసారి ఈ తప్పు చెయ్యకని చెప్పి చీర తీసుకొని కృష్ణ దగ్గరికి వెళ్తాడు మురారి. నన్ను తిడుతారని నువ్వు ఎందుకు నిజం చెప్పకుండా వాళ్ళు అన్న మాటలు అన్నీ పడ్డావ్. కేవలం నీ చదువుకు అయ్యే ఖర్చు భరించినందుకేనా లేక గతంలో ఏదైనా అంతకు మించి ఉందా అని కృష్ణని మురారి అడుగుతాడు.
ఆ తర్వాత నా భర్త మీరే అని చెప్పలేక కేవలం మీరు నన్ను చదివించారన్న కృతజ్ఞత మాత్రమే అని కృష్ణ చెప్తుంది. మీరు చెప్పేది అబద్దమని మీ కళ్ళు చెప్తున్నాయి. ఈ చీర కట్టుకొని రండి అంటూ మురారి వెళ్ళిపోతాడు. మరొకవైపు కృష్ణ విషయం ఏం చెయ్యలేకపోతున్నానని మధు ఫీల్ అవుతుంటాడు. అప్పుడే రేవతి ఏడుస్తు వస్తుంది. ఇందాక అమెరికా ఫ్రెండ్ తో అక్క మాట్లాడింది, ముకుంద అంత చెప్తుందని ఫోన్ లో అంటుంది.
అసలు ముకుంద ఏం చెప్తుందని రేవతి అంటుంది. పాపం కృష్ణ ఇన్ని అవమానాలు భరిస్తూ ఇక్కడే ఉంటుంది. ఇందాక పెద్దమ్మతో ముకుంద చెప్తుంటే నేను విన్నాను. కృష్ణకి ఆ రింగ్ మురారి తీసుకున్నాడంట అది చెప్తే ఎక్కడ మురారిని పెద్దమ్మ తిడుతుందోనని కృష్ణ చెప్పలేదని మధు అంటాడు. ఇక ఏడుస్తుంటే ఏం ప్రయోజనం లేదు అసలు అమెరికా ఫ్రెండ్ తో ఏం మాట్లాడవని పెద్దమ్మని వెళ్లి అడుగని మధు అనగానే సరేనని రేవతి అంటుంది.
మరొకవైపు అందరు కలిసి దీపావళి సెలబ్రేషన్స్ చేస్తుంటారు. కృష్ణ శకుంతల కూడా వస్తుంది. కృష్ణ మురారి కలిసి క్రాకర్స్ కాలుస్తుంటే ముకుంద చుడలేకపోతుంది. ఆ తర్వాత కృష్ణ కొంగుకి మంట అంటుకుంటుంది. వెంటనే మురారి మంట అర్పుతాడు. ఆ తర్వాత కృష్ణ కళ్ళు తిరిగి పడిపోతే మురారి ఎత్తుకొని తీసుకొని వెళ్తాడు. మరొక వైపు ఇంకా మురారి రావడం లేదు. గతం గుర్తుకు వచ్చిందా అని అందరు అనుకుంటారు.
ఆ తర్వాత రేవతి, మధు రాగానే.. మురారి ఎక్కడ అని భవాని అడుగుతుంది. కాసేపు అయ్యాక వస్తనని అన్నాడని మధు చెప్తాడు. తరువాయి భాగంలో.. మీకు అలా జరిగినప్పుడు ఎందుకు మిమ్మల్ని కృష్ణ అన్నారని మురారి అంటాడు. మరొక వైపు ఎందుకు నాకు వేణి గారే గుర్తుకు వస్తున్నారని మురారి కోపంగా అంటాడు. మరి ఇలాంటి పరిస్థితులలో.. భవాని అమెరికా ప్లాన్ ని కృష్ణ అపగలదా? తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.