English | Telugu

`జ‌బ‌ర్ద‌స్త్` న‌రేష్ కు మెగాస్టార్ బంప‌ర్ ఆఫ‌ర్‌?

`జ‌బ‌ర్ద‌స్త్` కామెడీ షోతో పాపులారిటీని సొంతం చేసుకున్న క‌మెడియ‌న్ లు చాలా మందే వున్నారు. అందులో న‌రేష్ ఒక‌రు. చూడ్డానికి చిన్న పిల్లాడిలా క‌నిపించే న‌రేష్ `జ‌బ‌ర్ద‌స్త్` షోలో త‌న‌దైన పంచ్ లు వేస్తూ న‌వ్వులు పూయిస్తున్నాడు. ఎందో మంది అభిమానుల్ని సొంతం చేసుకున్నాడు. వ‌రంగ‌ల్ జిల్లాలో పుట్టిన న‌రేష్ సినిమాల్లో న‌టించాల‌నే ఆశ‌తో హైద‌రాబాద్ వ‌చ్చాడు. అలా అవ‌కాశాల కోసం చూస్తున్న అత‌నికి `జ‌బ‌ర్ద‌స్త్` మంచి వేదిక‌గా మారి అత‌న్ని క‌మెడియ‌న్ గా ఆక‌ట్టుకున్నాడు.

అంచెలంచెలుగా `జ‌బ‌ర్ద‌స్త్` లో ఎదుగుతున్న న‌రేష్ కు తాజాగా బంప‌ర్ ఆఫ‌ర్ ల‌భించింద‌ట‌. ఈ విషయాన్ని స్వ‌యంగా క‌మెడియ‌న్ న‌రేష్ వెల్ల‌డించాడు. ఓ యూట్యూబ్ చాన‌ల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆస‌క్తిక‌ర విష‌యాల్ని వెల్ల‌డించాడు. `జ‌బ‌ర్ద‌స్త్` జ‌ర్నీ చాలా హ్యాపీగా సాగుతోంద‌ని ఇప్ప‌టికే కారు కొన్నాన‌ని. త్వ‌ర‌లోనే ఇల్లు కొన‌బోతున్నాన‌ని తెలిపాడు. ఈ ఏడాదే ఇల్లు కొన‌బోతున్నాన‌ని, ఆ త‌రువాతే పెళ్లి కూడా చేసుకుంటాన‌ని తెలిపాడు. ఇక త‌న పెళ్లి ఓ విత్రం అవుతుంద‌ని చెప్పుకొచ్చాడు.

అయితే అమ్మాయిని ఇంత వ‌ర‌కు చూడ‌లేద‌ని, అయితే ఇల్లు కొన‌గానే అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటాన‌న్నాడు. పెళ్లి గురించి ఇంట్లో వాళ్లు ఎలాంటి వొత్తిడి చేయ‌డం లేద‌ని తెలిపాడు. ఇదే సంద‌ర్భంగా మెగాస్టార్ చిరంజీవి సినిమాలో త‌న‌కొచ్చి బిగ్ ఆఫ‌ర్ ని బ‌య‌ట‌పెట్టాడు. చిరంజీవిగారిని ఒక్క‌సారైనా క‌ల‌వాల‌న్న‌ది నా డ్రీమ్ అని, అయితే ఆయ‌నే స్వ‌యంగా `భోళా శంక‌ర్‌` మూవీ కోసం న‌న్ను రిక‌మెండ్ చేశార‌ని. నా జీవితంలో మర్చిపోలేని విష‌యం ఇదన్నాడు. అంతే కాకుండా ఈ మూవీలో త‌న‌ది ఫుల్ లెంగ్త్ రోల్ అని చెప్పి `జ‌బ‌ర్ద‌స్త్`న‌రేష్ షాకిచ్చాడు.