English | Telugu

బాహుబలిలో ఛాన్స్ ఇస్తే ఆ రోల్ లో చేసేదాన్ని....


పటాస్ షో ద్వారా అందరికీ తెలిసిన జబర్దస్త్ షో లేడీ కమెడియన్ గా ఇప్పుడు బాగా పాపులర్ అయ్యింది. తన కామెడీ టైమింగ్ తో ఎంతోమంది ఫాన్స్ ని సొంతం చేసుకుంది. పేద కుటుంబం నుంచి వచ్చిన ఫైమా ఇప్పుడు బుల్లితెర మీద షోస్ చేస్తూ తనకంటూ ఒక స్టైల్ ని క్రియేట్ చేసుకుంది. ఆమె చెప్పిన కొన్ని డైలాగ్స్ కూడా మీమ్స్, ట్రోల్ల్స్ అవుతూనే ఉంటాయి. జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చాక టాప్ కమెడియన్స్ లిస్ట్ లోకి వెళ్లిన ఫైమాకి బిగ్ బాస్ 6 హౌస్ లోకి వెళ్లే ఛాన్స్ వచ్చింది. దీంతో ఆమెఇంకా ఫేమస్ ఐపోయింది. ఆమె యూట్యూబ్ చానెల్ కూడా రన్ చేస్తూ ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ లో ఆడియన్స్ అడిగే ప్రశ్నలకు జవాబులు చెప్తూ ఉంటుంది. అలాగే తన పేజీకి రీసెంట్ గానే బ్లూ టిక్ కూడా వచ్చింది. అలాంటి ఫైమా ఇప్పుడు ఆడియెన్స్ తో చిట్ చాట్ చేసింది.

అడిగిన ప్రశ్నలకు ఆన్సర్స్ చెప్పి తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసింది. "మూవీస్ లో ఎప్పుడు కనిపిస్తారు సిస్టర్ ? అని అడిగేసరికి..."మూవీస్ లో కచ్చితంగా కనిపిస్తాను..అవి రిలీజ్ కాగానే మీకు చెప్తాను." "10 th పర్సెంటేజ్ ఎంత అని అడిగేసరికి "8 . 5 , ఇంటర్లోకి వచ్చేసరికి ఎవరైనా మెట్లు ఎక్కుతారు, కానీ నేను మెట్లు దిగాను. ఆ తర్వాత నాకు సరిగా మెట్లు కనిపించక జర్రున జారుకుంటూ వచ్చేసా..డిగ్రీకి వచ్చేసరికి నిల్. "మీ ఊరి పేరు ఏమిటి" "దోమకొండ..ఇది ఎవరికీ తెలియకపోవచ్చు...కానీ కామారెడ్డి తెలిసిన వాళ్లకు ఈ ఊరు తెలుస్తుంది." "మీరు చిన్నప్పుడు డాన్స్ నేర్చుకోకుండానే ఇంత బాగా ఎలా డాన్స్ చేస్తున్నారు" "స్కూల్ లో డాన్స్ చేసేదాన్ని. కొంచెం తెలుసు. నాకు డాన్స్ అంటే ఇష్టం. అందుకే డాన్స్ నాకు చాలా ఈజీ ఐపోయింది." " బాహుబలిలో ఒకవేళ నీకు ఛాన్స్ వచ్చి ఉంటే ఏ క్యారెక్టర్ చేసే దానివి ? " " ఈ ఊహే చాలా బాగుంది. ఒక వేళ ఛాన్స్ వస్తే సైనికుల్లో లాస్ట్ లో నిల్చున్నా చాలు.

ఎందుకంటే అందులో చేయడమే గొప్ప కాబట్టి." " మీ కెరీర్ ఎలా స్టార్ట్ అయ్యింది." "స్టార్ట్ అవడం శ్యాడ్ గా స్టార్ట్ అయ్యింది..బట్ ఇప్పుడు చాల హ్యాపీ" "మీ ఫేవరేట్ కలర్ ఏది" "బ్లాక్" " చిన్నప్పటినుంచి ఏ నిక్ నేమ్ తో పిలిచేవారు" "నిక్ నేమ్ అంటూ ఏమీ లేదు..కానీ ఇంట్లో ఫయ్యు" అని పిలిచేవారు. "మీ నెక్స్ట్ ప్లాన్ ఏమిటి" "నా నెక్స్ట్ ప్లాన్ ఏమిటి అంటే ఇప్పటి వరకు 199 తో రీఛార్జి చేయించుకునే దాన్ని కానీ ఇప్పటినుంచి 299 తో రీఛార్జి చేయించుకుంటాను..అని ఫన్నీ గా చెప్తూనే ఇది జోక్..నెక్స్ట్ ప్లాన్ మూవీస్" అని చెప్పింది.