English | Telugu

నాన్న గురించి సుదీర్ఘ లేఖను రాసిన రిషి సర్!


గుప్పెడంత మనసు సీరియల్ హీరో రిషి సర్ గురించి ప్రతీ ఒక్కరికి తెలుసు. అతని స్టైల్, అతని ఆటిట్యూడ్ ని యూత్ ఫాలో అవుతోంది. ఇక బుల్లితెర మీద వసుధారా, రిషి సర్ ఒక మ్యాజిక్ క్రియేట్ చేశారు. వాళ్ళ మ్యాజిక్ తోనే ఆ సీరియల్ టాప్ రేటింగ్ లోకి వెళ్ళింది. అలాంటి రిషి సర్ లైఫ్ లో తనకు ఎంతో ఇష్టమైన వాళ్ళ నాన్నను రీసెంట్ గా కోల్పోయారు. ఆ విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ పేజీ ద్వారా షేర్ చేసుకున్నారు. ఐతే ఇప్పుడు తన మనసులో ఉండిపోయిన ఎన్నో విషయాలను చాల సుదీర్ఘంగా పంచుకున్నారు. "నేను ఇక్కడ కూర్చున్నప్పుడు, మనం పంచుకున్న సమయాలు గుర్తొచ్చి , నా హృదయం వేదనతో నిండిపోతోంది.

మీరు ఇన్ని సంవత్సరాలలో ఆరోగ్య పరంగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. అయినప్పటికీ ధైర్యంగా నిలబడ్డారు. మానసిక బలానికి, పట్టుదలకు నిజమైన రూపం మీరు. పరిస్థితులు ఎలా మారినా మీరు మాపై చూపించే ప్రేమ తగ్గలేదు. నాపై మీ అచంచలమైన విశ్వాసం, మీ మద్దతు, నాపై మీరు పెట్టుకున్న నమ్మకం నాకు జీవితంలోని అడ్డంకులను ఎదుర్కొనే ధైర్యాన్ని ఇచ్చింది. అనారోగ్యంతో బాధపడుతూ కూడా మాకు దయ, కరుణ యొక్క విలువలని నేర్పారు. మీరు భౌతికంగా మా మధ్య లేనప్పటికీ మీ వారసుడిగా నాలో ఆ భావాలు అలాగే ఉన్నాయి. మీరు నాకు నేర్పిన పాఠాలే నన్ను ఎప్పటికీ నడిపిస్తాయి. మనం కలిసున్న జ్ఞాపకాలను, పంచుకున్న ఆనందాలను, కలిసి గడిపిన విలువైన క్షణాలను నేనెప్పటికీ మర్చిపోను. మీరు ఇన్నాళ్లుగా అనుభవించిన బాధ నుంచి మీకు విముక్తి కలిగినందుకు నా మనసుకు కొంచెం ఓదార్పు కలిగింది. మీరు ఎప్పటికీ నా హీరో, నా రోల్ మోడల్‌, నా ప్రియమైన తండ్రిగానే మిగిలిపోతారు. మీ ప్రేమ, బలం ప్రతిరోజూ నాకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయి. ఇట్లు ముఖేష్..." అంటూ రిషి సర్ తన తండ్రి జ్ఞాపకాలను ఇలా తన ఇన్స్టాగ్రామ్ పేజీ ద్వారా ఆడియన్స్ తో షేర్ చేసుకున్నాడు. ముఖేష్ గౌడాకి వాళ్ళ నాన్న అంటే ఎంత ఇష్టమో ఆ చాముండేశ్వరి దేవి అన్నా కూడా అంత ఇష్టం. రిషి సర్ కి లేడీ ఫాన్స్ చాలా మంది ఉన్నారు.

ఈ సీరియల్ ఎంత పాపులర్ అయ్యిందంటే హాస్య బ్రహ్మ బ్రహ్మానందం ఆయన్ని పర్సనల్ గా కలిసి అభినందించారు కూడా. కొన్నేళ్లుగా పక్షవాతంతో బాధపడుతూ ఇంటివద్దనే చికిత్స పొందుతూ ముఖేష్ వాళ్ళ నాన్న ఇటీవలే మరణించారు. తన నాన్న అంటే తనకు ఎంత ఇష్టమో స్టార్ మా పరివార్ అవార్డ్స్ ఫంక్షన్ లో మనమంతా చూసాం. ఈ ప్రోగ్రామ్‌లో తన తల్లితండ్రుల మీద చూపించిన ప్రేమను చూసి చాలామంది ముఖేష్ కు ఫ్యాన్స్ అయిపోయారు. ఇలాంటి కొడుకు ఉంటే బాగుంటుంది అనిపించేలా చేసాడు.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.