English | Telugu
కార్ కొన్న ఫైమా..విషెస్ చెప్పిన నెటిజన్స్
Updated : Oct 21, 2023
జబర్ధస్త్ ఫైమా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు పటాస్ ఫైమా. తన కామెడీ టైమింగ్ తో పంచులతో బులెట్ భాస్కర్ టీమ్ లో కంటెస్టెంట్ గా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. కేవలం ఫైమా కామెడీ కోసం జబర్ధస్ షో చూసేవాళ్ళు చాల మంది ఉన్నారు. అతి తక్కువ సమయంలోనే బుల్లితెరపై తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. జబర్ధస్త్ షోతో పాటు ఆదివారం విత్ స్టార్ మా పరివారం లో అలాగే చేస్తోంది. అలాగే బిగ్బాస్ కి వెళ్ళొచ్చింది. తన గోల్ సొంత ఇల్లు. అలాగే వాళ్ళ అమ్మ నాన్న కోసం సొంత ఇల్లు తీసుకుంది. ఇక ఇప్పుడు ఆమె వాళ్ళ కోసం కార్ కూడా కొనేసింది. తన చిన్నప్పుడు తన నాన్నకు చిన్న సైకిల్ మాత్రమే ఉండేదని..వాళ్ళ అమ్మ ఎక్కడికైనా వెళ్ళాలి అంటే బస్సు, ఆటో రిక్షాల్లోనే వెళ్లేదని చెప్పింది ఫైమా. అలాగే తన కార్ కొనడం కోసం బులెట్ భాస్కర్ ని కూడా ఇన్వైట్ చేసింది అలా వాళ్ళ పేరెంట్స్ తో భాస్కర్ తో షో రూమ్ కి వెళ్ళింది. వీళ్ళతో పాటు పటాస్ ప్రవీణ్ కూడా వచ్చాడు.
షో రూమ్ లో కేక్ కోసింది ఫైమా. హ్యుందాయ్ రెడ్ కలర్ కార్ కొన్నది ఫైమా. ఇక భాస్కర్, ఫైమా ట్రయల్ రైడ్ వేశారు. పటాస్ ప్రవీణ్ అలిగేసరికి ఇప్పుడు ఫైమాకి కార్ కొన్నా కాబాట్టి తర్వాత ప్రవీణ్ కి తీసుకుంటాను అని చెప్పాడు భాస్కర్. ఇక నెటిజన్స్ మాత్రం ఫైమా కస్టపడి ఎదిగి ఇల్లు, కార్ అన్ని తీసుకుంటోంది అంటూ విషెస్ చెప్తున్నారు. పటాస్ షో ఆపేసిన టైంలో జబర్ధస్త్ షో ఆఫర్ వచ్చింది. ఈ షోలోకి అడుగుపెట్టిన తర్వాత ఫైమా మళ్లీ వెనుదిరిగి చూసుకోలేదు. తన కామెడీ టైమింగ్.. పంచులతో ఆడియన్స్ ని బాగా ఎంటర్టైన్ చేస్తుంది. అతి తక్కువ టైంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. భాస్కర్, ఇమాన్యుయేల్, వర్ష, ఫైమా మధ్య వచ్చే కామెడీ స్కిట్స్ ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు.