English | Telugu
అరకులో కొత్తజంట!
Updated : Oct 21, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -899 లో.. మహేంద్రతో ఫణీంద్ర మాట్లాడి అక్కడ నుండి శైలేంద్ర దేవయానిలను తీసుకొని వెళ్ళిపోతాడు. ఆ తర్వాత వసుధారని లగేజ్ సర్దుమని రిషి చెప్తాడు. రిషి, వసుధారలు కలిసి మహేంద్రని ప్రశాంతంగా జగతి జ్ఞాపకాల నుండి దూరం చెయ్యడానికి అరకు తీసుకొని వెళ్తారు.
ఆ తర్వాత అరకులో ఒక రిసార్ట్ దగ్గరకి వస్తారు. మహేంద్ర ఒక్కసారిగా ఆ ప్లేస్ చూసి ఏవేవో జ్ఞాపకాలు వచ్చినట్లు ప్రవర్తిస్తాడు. నన్ను ఇక్కడకు ఎందుకు తీసుకొచ్చావ్ రిషి అంటూ మహేంద్ర అడుగుతాడు. మీరు ప్రశాంతంగా ఉండాలంటే ఇలాంటి ప్లేస్ అయితే కరెక్ట్ అని ఇక్కడకి తీసుకొని వచ్చానని రిషి చెప్తాడు. మహేంద్రని రిషి బలవంతంగా అక్కడ ఉండడానికి ఒప్పిస్తాడు. ఆ తర్వాత గదిలోకీ వెళ్లిన మహేంద్ర.. డల్ గా కూర్చొని ఉంటాడు. ఏమైంది ఈ రూమ్ మీకు నచ్చలేదా అని రిషి అడుగుతాడు. మీ కంఫర్ట్ కోసమే ఈ రూమ్ తీసుకున్నానని రిషి చెప్తాడు. మరొకవైపు వసుధార మరొక రూమ్ లో ఉంటుంది. ఆ తర్వాత కాసేపటికి మహేంద్ర గురించి రిషి బయట నిల్చొని ఆలోచిస్తుంటాడు. అప్పుడే రిషి దగ్గరికి వసుధార వచ్చి మాట్లాడుతుంది. ఇద్దరు కలిసి మహేంద్రని ఎలాగైనా మాములుగా చెయ్యాలని అనుకుంటారు.
మరొక వైపు జగతి ఫొటో దగ్గరికి దేవయాని వెళ్లి.. నువ్వు ఉన్నప్పుడు నా కొడుకుని ఎండీ సీట్ లో కూర్చోనివ్వకుండా చేసావ్. నువ్వు లేనప్పుడు కూడా ఎండీ సీట్ లో కూర్చోలేదు. అందుకు నువ్వు సంతోషంగా ఉన్నట్లున్నావని దేవయాని అనుకుంటుంది. ఆ తర్వాత ఒక్కసారిగా ఏదో గాలి వచ్చినట్లు దేవయానికి అనిపిస్తుంది. అది చూసి ఏంటి జగతి ఆత్మలాగా మరి నా మాటలు వింటున్నావా అని దేవయాని అంటుంది. అప్పుడే శైలేంద్ర వచ్చి నేను కాలేజీకీ వెళ్తున్నానని చెప్తాడు. అదే సమయంలో ఫణింద్ర వచ్చి కాలేజీకి ఎందుకని అడుగుతాడు. రిషి వసుధారలు లేరు కదా, కాలేజీ నీ చూసుకోవాలి కదా అని శైలేంద్ర అనగానే.. ఫస్ట్ నీ భార్యని మంచిగా చూసుకోమని ఫణింద్ర అంటాడు. ఆ తర్వాత ఇద్దరు బయటకు వెళ్తారు. మరొక వైపు ఇక్కడే మనప్రేమ మొదలైంది నీ జ్ఞాపకాలు దూరం చెయ్యాలని చెప్పి, తెలియకుండానే రిషి మళ్ళీ ఇక్కడికి తీసుకొని వచ్చాడని మహేంద్ర అనుకుంటాడు.. అప్పుడే రిషి, వసుధారలు వచ్చి బయటకు వెళ్దామని మహేంద్రతో అనగానే.. మీరు ఇద్దరు వెళ్ళండి. నేను ఎందుకని మహేంద్ర అంటాడు. మహేంద్ర సర్ ని వదిలి వెళ్లొద్దు సర్ అని వసుధార అనగానే.. రిషి నీ భర్త ఇప్పుడు కూడా సర్ అంటున్నావేంటని మహేంద్ర అడుగుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.