English | Telugu
కెప్టెన్సీ టాస్క్ లో గెలిచిందెవరో తెలుసా?
Updated : Oct 21, 2023
బిగ్ బాస్ సీజన్-7 రోజు రోజుకి ఆసక్తిగా మారుతుంది. ఇప్పటికి ఆరు వారాలు పూర్తిచేసుకొని ఏడవ వారంలోకి అడుగుపెట్టగా, కెప్టెన్సీ టస్క్ లు మరింత ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి.
గత అయిదు రోజుల నుండి సాగుతున్న గ్రహాంతర వాసులని సంతోషపరిచే టాస్క్ లు నిన్నటితో ముగిసాయి. జిలేబీపురం టీమ్ గెలిచి కెప్టెన్సీ రేస్ లో నిలిచారు. ఇందులో పల్లవి ప్రశాంత్, అంబటి అర్జున్, ఆట సందీప్, శివాజీ, ప్రియాంక జైన్ ఉన్నారు. దాంతో బిగ్ బాస్ వీరికి మరో టాస్క్ ఇచ్చాడు. అదేంటంటో కెప్టెన్సీ రేస్ లో ఉన్నవారిలో ఎవరు కెప్టెన్ కి అనర్హులని భావిస్తారో వారి బోట్ ని స్విమ్మింగ్ పూల్ లో పడేయాలని చెప్పాడు బిగ్ బాస్. అయితే మొదటగా శివాజీని అమర్ దీప్ కెప్టెన్సీ రేస్ నుండి తప్పించాడు. ఆ తర్వాత పల్లవి ప్రశాంత్ ని పూజా మూర్తి తప్పించింది. ఇక ఆ తర్వాత బజర్ కి ఎవరు సెలెక్ట్ చేసుకోకపోయేసరికి బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చాడు. ఇక శోభాశెట్టి కంటెంట్ కోసం మాములుగా పర్ఫామెన్స్ ఇవ్వలేదు. అందరు సేఫ్ గేమ్ ఆడుతున్నారంటూ యావర్ మీద సీరియస్ అయింది శోభాశెట్టి. మాకు డెసిషన్ తీసుకోవడానికి సమయం కావాలని యావర్ చెప్పాడు. ఆ తర్వాత యావర్ బాగా డిసైడ్ అయి ప్రియాంక జైన్ ని తప్పించాడు. దాంతో సీరియల్ బ్యాచ్ అంతా కెప్టెన్సీ రేస్ నుండి అవుట్ అయ్యారు. ఇక కెప్టెన్సీ రేస్ లో ఆట సందీప్, అంబటి అర్జున్ ఉన్నారు.
ఇక ఆ తర్వాతి గోస్ట్ రూమ్ కి హౌస్ మేట్స్ అందరిని పిలిపించాడు బిగ్ బాస్. అందులో ' మ్యాన్షన్24' వెబ్ సిరీస్ దర్శకుడు ఓంకార్, నటీనటులు అవికా గోర్, నందు, వరలక్ష్మీ శరత్ కుమార్ ఉన్నారు. ఇక వాళ్ళ వెబ్ సిరీస్ ప్రమోషన్ చేసుకొని అందులోని కొంతమందిని తమ తర్వాతి సినిమాకి సెలెక్ట్ చేసుకున్నాడు ఓంకార్. యావర్, ఆట సందీప్ లని తన సినిమాకి ఎంచుకున్నాడు డైరెక్టర్ ఓంకార్.