English | Telugu

నా మనోభావాలు దెబ్బతిన్నాయి బావ... ఆ పాట గురించే కదా!


బిగ్ బాస్ సీజన్-7 ఇప్పటిదాకా ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క అన్నట్టు సాగుతున్నాయి. సోమవారం మొదలైన నామినేషన్ లో కంటెస్టెంట్స్ మధ్య హీటెడ్ ఆర్గుమెంట్స్ జరిగాయి. సీరియల్ బ్యాచ్ లోని ప్రియాంక, శోభాశెట్టిని రతిక నామినేట్ చేయడంతో మరింత నామినేషన్ ప్రక్రియ వాడివేడీగా సాగింది.

నిన్న జరిగిన నామినేషన్ లో ప్రియాంక జైన్ బాటిల్ పగులగొట్టి అశ్వినిశ్రీ మీద విసిరేయడంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ మొదలయ్యాయి. ఎంత అయిష్టత ఉంటే మాత్రం ఇలా చేస్తారా అంటు నెటిజన్లు ప్రియాంకని తిడుతున్నారు. మరొకవైపు నామినేషన్ కి సంబంధించిన ప్రోమో ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. ఇందులో అమర్ దీప్ ని అశ్వినిశ్రీ నామినేట్ చేసింది. అది కాస్త ఇప్పుడు వైరల్ గా మారింది.


దీపావళి రోజు జరిగిన ఒక టాస్క్ లో అమర్ దీప్ లిరిక్స్ రాసి పాట పాడాడు. అందులో అశ్వినిశ్రీ నామినేషన్ అంటే చాలు ఏడుస్తుందంటూ అమర్ దీప్ పాట రూపంలో చెప్పాడు. ఇక ఇది విని అశ్వినిశ్రీ హర్ట్ అయిపోయింది. నామినేషన్ లో మొదట అమర్ దీప్ ని అశ్వినిశ్రీ నామినేట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక అశ్వినిశ్రీ రీజన్ చెప్తుండగా అమర్ దీప్ ఆపి.. ఆ పాట గురించే కదా అని అనగా అవునని అశ్వినిశ్రీ అంది. అది నేను ఒక్కడినే రాయలేదు. అర్జున్ కూడా చెప్పాడని అమర్ అనగానే.. పాట హిట్టు అయితే నీకు క్రెడిట్ తీసుకుంటావా? ఫెయిల్ అయితే నాకు ఇస్తావా అంటూ అర్జున్ అన్నాడు‌. " నా బావ మనోభావాలు దెబ్బతిన్నాయి బావ" అని అశ్వినిశ్రీ అనగానే హౌస్ లో అందరూ నవ్వేసారు. ఇక రాజమాతలుగా ఉన్నపుడు తనని డామినేట్ చేసిన ప్రియాంక జైన్ ని నామినేట్ చేసినట్టు తెలుస్తోంది.

యావర్ ని శోభాశెట్టి నామినేట్ చేసినట్టు తెలుస్తుంది. దొరికేసావ్ దొరికేసావ్ అంటు శోభాశెట్టిని యావర్ అనడంతో మరింత హైప్ క్రియేట్ అయింది. ఆ తర్వాత అంబటి అర్జున్ ని పల్లవి ప్రశాంత్ నామినేట్ చేసినట్టు తెలుస్తుంది.