English | Telugu

డాక్టర్ బాబు సినిమా ఛాన్స్.. నాని కొట్టేశాడు!

టాలీవుడ్ లో నేచురల్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న హీరో నాని.. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సోలోగా పైకొచ్చాడు. అలాంటి నాని తన సినిమా ఛాన్స్ కొట్టేశాడని అంటున్నారు 'కార్తీక దీపం' సీరియల్ ఫేమ్ నిరుపమ్. నిజానికి నాని దర్శకుడు కావాలనే ఆశతో ఇండస్ట్రీకి వచ్చాడు. కొన్ని సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పని చేశారు. ఈ క్రమంలో ఎన్నో కథలను కూడా రాసుకున్నాడు.

కానీ ఊహించని విధంగా అతడికి 'అష్టా చమ్మా' సినిమాలో హీరోగా ఛాన్స్ రావడంతో మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకొని అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ సినిమా రిజల్ట్ తో నానికి వరుస అవకాశాలు వచ్చాయి. 'ఈగ', 'పిల్ల జమీందార్' లాంటి సినిమాల తరువాత ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. అయితే హీరోగా నానికి మొదటి ఛాన్స్ రావడానికి పరోక్షంగా నటుడు నిరుపమ్ కారణమయ్యాడని తెలుస్తోంది.

నిజానికి 'అష్టా చమ్మా' సినిమాలో హీరో ఛాన్స్ ముందుగా తన దగ్గరకు వచ్చిందని నిరుపమ్ చెప్పాడు. మొద‌ట ఆడిష‌న్స్‌ను ర‌మ్మ‌ని చెప్పి, త‌ర్వాత రోజు బ‌య‌లుదేర‌బోతుంటే రావ‌ద్ద‌ని చెప్పార‌ని ఆలీతో స‌ర‌దాగా షోలో వెల్ల‌డించాడు. అప్పుడే ఓ సీరియల్ సైన్ చేయడంతో 'అష్టా చమ్మా' మేకర్లు తనకు ఛాన్స్ ఇవ్వలేదని.. సీరియల్స్ తో బిజీగా ఉన్నావ్ గా.. సినిమా ఆడిషన్స్ వద్దులే అంటూ తనను లైట్ తీసుకున్నార‌ని నిరుపమ్ చెప్పుకొచ్చాడు. మొదట ఇంట్రెస్ట్ చూపించిన డైరెక్ట‌ర్ మోహ‌న‌కృష్ణ తరువాత తాను సీరియ‌ల్ యాక్ట‌ర్‌న‌నే ఉద్దేశంతో ప‌క్క‌న పెట్టిన‌ట్లున్నార‌ని బాధ‌ప‌డ్డాడు.

వేరే స్టేట్ అమ్మాయితో అఖిల్ పెళ్లి...

చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కేలో సుమ క్యారెక్టర్స్ చేంజ్ చేసి అసలు వాళ్ళ స్టోరీలను బయటకు తీసుకొచ్చింది. అఖిల్ - అమరదీప్ జోడిగా కాంటెస్ట్ చేస్తున్నారు. ఐతే అమరదీప్ ని అమ్మాయిగా నటించాలని అఖిల్ ని అబ్బాయిగా నటించాలని చెప్పింది. ఒకరి బాధలు ఒకరు చెప్పుకోవాలి అంది. అమరదీప్ తన బాధ చెప్తూ "అతను నాతో చేయించుకోవాల్సినవన్నీ చేయించుకున్నాడు పెళ్లి ఎప్పుడూ అంటే పెళ్ళాం ఒప్పుకోవాలి అన్నాడు" అంటూ అమరదీప్ ఏదో కథ చెప్పేసరికి అక్కడే ఉన్న మానస్ ఇదేదో అమరదీప్ కథలానే ఉందే అంటూ అసలు విషయం చెప్పేసాడు. "అరేయ్ నిన్నెవరు అడిగ్గార్రా" అంటూ అమరదీప్ కంగారుపడ్డాడు.