English | Telugu

కొత్తింటికి మారిన బిగ్ బాస్ బ్యూటీ!

యాంకర్ గా కెరీర్ మొదలుపెట్టి అతి తక్కువ సమయంలోనే సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ దక్కించుకుంది అరియానా గ్లోరీ. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో చేసిన ఒక్క ఇంటర్వ్యూతో అరియానా బాగా ఫేమస్ అయిపోయింది. గతేడాది బిగ్ బాస్ సీజన్ 4 లో కంటెస్టెంట్ గా పాల్గొనే ఛాన్స్ ను దక్కించుకుంది. ఈ షోలో అమ్మడు తన ముక్కుసూటితనంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. పలు సెలబ్రిటీలు సైతం అరియనా యాటిట్యూడ్ కు ఫిదా అయ్యారు.

హౌస్ లో ఉన్నన్ని రోజులు ఆమెకి ఓట్లు వేసి ఫైనల్స్ వరకు తీసుకొచ్చారు. కానీ ఆమె ట్రోఫీ అందుకోలేకపోయింది. హౌస్ నుండి బయటకి వచ్చిన తరువాత అరియానాకు ఇండస్ట్రీలో అవకాశాలు బాగానే వస్తున్నాయి. పలు టీవీ షోలలో కనిపించడంతో పాటు సినిమాలు కూడా సైన్ చేస్తోంది. రీసెంట్ గా ఈ బ్యూటీ పెళ్లికూతురు గెటప్ లో కనిపించడంతో ఆమె పెళ్లి చేసుకోబోతుందంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి.

ఇదిలా ఉండగా.. తాజాగా అరియానా కొత్తింటికి షిఫ్ట్ అయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియోలో అరియానా తన మంకీ బొమ్మను చూపిస్తూ.. చింటూని బాగా మిస్ అయ్యానంటూ సందడి చేసింది. ఎక్కడపడితే అక్కడ సామాన్లతో నిండిపోయి గజిబిజిగా ఉన్న ఇంటిని చూపిస్తూ.. కొత్త ఇంటికి మారాం.. చూడండి ఇదీ మా పరిస్థితి అంటూ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో చెప్పుకొచ్చింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. కొత్తిల్లు కొన్నారా అంటూ ప్రశ్నలు కురిపిస్తున్నారు. కానీ అరియనా మాత్రం సమాధానం చెప్పలేదు!

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.