English | Telugu

నేను చూసిన రాణివి నువ్వే!

'సుడిగాడు' సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది మోనాల్. ఆ తరువాత వివిధ భాషల్లో పదికి పైగా చిత్రాల్లో నటించినప్పటికీ.. సరైన గుర్తింపును మాత్రం సంపాదించలేకపోయింది. గతేడాది ప్రసారమైన బిగ్ బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్ గా పాల్గొని కాస్త క్రేజ్ తెచ్చుకుంది. అయితే హౌస్ లో ఉన్నంతకాలం ఆమె అఖిల్ సార్థ‌క్‌తో ఎంత క్లోజ్ గా ఉందో తెలిసిందే. బయటకి వచ్చిన తరువాత కూడా ఈ జంట చెట్టాపట్టాలేసుకొని తిరుగుతుండడంతో ఇద్దరి మధ్య ఏదో నడుస్తుందనే మాటలు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉండగా.. ఈరోజు మోనాల్ పుట్టినరోజు సందర్భంగా అఖిల్ ఆమెకు విషెస్ చెప్పిన తీరు నెటిజ‌న్స్‌ను ఆకట్టుకుంటోంది. ఇన్స్టాగ్రామ్ లో మోనాల్ తో కలిసి తీసుకున్న ఫోటోలను షేర్ చేస్తూ.. తను రాణులకు సంబంధించిన చాలా కథలు విన్నానని.. "కానీ నిజజీవితంలో చూసిన రాణివి మాత్రం నువ్వే." అంటూ మోనాల్ ని తెగ పొగిడేశాడు. ఇంతకుమించి మోనాల్ గురించి ఎలా అభివర్ణించాలో తనకు తెలియడం లేదని.. తనకు ఇలాంటి అద్భుతమైన వ్యక్తిని పరిచయం చేసిన బిగ్ బాస్ కి థాంక్స్ చెప్పాడు.

ఎల్లపుడూ నీ వెంటే ఉంటానంటూ.. ఎలాంటి పరిస్థితి ఎదురైనా నీకు అండగా ఉంటానంటూ మోనాల్ ని ఉద్దేశిస్తూ ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. అఖిల్ పెట్టిన ఈ పోస్ట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు మోనాల్ కి విషెస్ చెబుతూ అఖిల్ ఎమోషనల్ మాటలకు ఫిదా అవుతున్నారు. త్వరలోనే ఈ జంట 'గుజరాతి అమ్మాయి తెలుగు అబ్బాయి' అనే పేరుతో తెరకెక్కుతోన్న సిరీస్ లో నటించబోతున్నారు.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.