English | Telugu

రాజ్ కొత్త కంపెనీ గురించి తెలుసుకున్న రాహుల్.. స్వప్న నిజం కనిపెడుతుందా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -885 లో.. మేనేజర్ తో రాజ్ మాట్లాడుతాడు. కొత్త కంపెనీకి సంబంధించి పనులు మొత్తం త్వరగా కావాలని చెప్తాడు. మీరు స్వరాజ్ కంపెనీతో ఎలాంటి సంబంధం లేకుండా అన్ని కొత్తగా ఉండాలని అంటున్నారు.. అలాంటప్పుడు కొంచెం టైమ్ పడుతుందని మేనేజర్ అంటాడు. త్వరగా పనులు పూర్తి చేయండి అని చెప్పి రాజ్ ఫోన్ కట్ చేస్తాడు. అదంతా కావ్య వింటుంది. ఇలా మీరు కొత్త కంపెనీ పెడుతున్నారని అత్తయ్య వాళ్లకి తెలిస్తే బాధపడుతారని కావ్య అంటుంది. దాని గురించి నువ్వేం ఆలోచించకు అని రాజ్ చెప్తాడు.

ఇప్పుడు రాహుల్ కి ఒక అవకాశం ఇస్తే బాగుంటుందని కావ్య అనగానే వద్దు వాడు నేర్చుకునే స్టేజ్ లో ఉన్నాడని రాజ్ అంటాడు. మరొకవైపు రాహుల్ ఆఫీస్ కి వచ్చి శృతిని పిలుస్తాడు. ఫైల్ ఎక్కడ ఉందని అడుగుతాడు. మేనేజర్ క్యాబిన్ దగ్గర అని శృతి చెప్పగానే సరే నేను వెళ్లి తెచ్చుకుంటా.. నువ్వు వెళ్ళు అని రాహుల్ అంటాడు రాహుల్ మేనేజర్ క్యాబిన్ లో కొత్త కంపెనీకి సంబంధించిన ఫైల్ చూస్తాడు. అది చూసి షాక్ అవుతాడు. శృతిని దాని గురించి అడుగుతాడు రాహుల్. నాకు తెలియదని తను చెప్తుంది. నేనే వెళ్లి తెలుసుకుంటానని రాహుల్ అనుకుంటాడు. వెంటనే కొత్త కంపెనీ దగ్గరికి వెళ్లి నన్ను రాజ్ పంపించాడని చెప్పి అన్ని వివరాలు కనుక్కుంటాడు. మరొకవైపు సుభాష్ ని పెళ్లికొడుకుగా అపర్ణని పెళ్లికూతురులాగా రెడీ చేస్తారు.

ఆ తర్వాత రాహుల్ ఇంటికి వెళ్లి రుద్రాణితో చిరాకుగా మాట్లాడుతుంటే స్వప్న చూస్తుంది. రాహుల్ ఏంటి అలా ఉన్నాడని తన దగ్గరికి వెళ్లి ఏమైందని అడుగుతాడు. రాజ్ కొత్త కంపెనీ స్టార్ట్ చేస్తున్నాడు అంతే కాదు పాత కంపెనీ నుండి కేజీల్లో బంగారం కోట్లలో డబ్బు ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారు కానీ వాటికి సంబంధించిన ఏ డాక్యుమెంట్స్ లేవు.. ఇలా ఎందుకు చేస్తున్నాడో ఏమోనని రాహుల్ అనగానే తన లాప్ టాప్ లో చూస్తే ఆ కంపెనీకి సంబంధించినవి తెలుస్తుందని స్వప్న అంటుంది. నేను కనుక్కుంటానని స్వప్న చెప్పగానే రాహుల్ కన్నింగ్ గా ఒక నవ్వు నవ్వేస్తాడు. తరువాయి భాగంలో స్వప్న వచ్చి కొత్త కంపెనీ గురించి రాజ్ ని నిలదీస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.