English | Telugu
llu illalu pillalu : శోభ కోసం ఇద్దరు కోడళ్ళు వెతుకులాట.. వేదవతి వల్లే దొరికిపోయారుగా!
Updated : Oct 31, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu)'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-303 లో..... నర్మద, ప్రేమ, వేదవతి ముగ్గురు కలిసి శోభని కిడ్నాప్ చేసిన వాళ్ళని వెతకడానికి వెళ్తారు. వేదవతి తన తింగరి చేష్టలతో ఇద్దరు కోడళ్లకి చిరాకు తెప్పిస్తుంది. అసలు ఏమైంది అత్తయ్య.. నీ అత్త పోరు ఇంటికి వెళ్ళాక చూసుకుందాం కానీ ఇప్పుడు సైలెంట్ గా ఉండమని నర్మద అంటుంది. మరొకవైపు శోభని కిడ్నాప్ చేసినవాడు.. తన ఫ్రెండ్ కి కాల్ చేసి ఇంటికి ఎవరైనా వస్తే. నా గురించి చెప్పకని చెప్తాడు. అప్పుడే అత్తాకోడళ్ళు కిడ్నాప్ చేసిన వాడి ఫ్రెండ్ ని చూసి అతనికి ఏమైనా తెలుసో కనుక్కుందామని వేదవతి అంటుంది. అలా డైరెక్ట్ గా ఎవరిని అడగొద్దని నర్మద అంటుంది.
అయినా వినపకుండా.. బాబు ఒక అమ్మాయిని కిడ్నాప్ చేశారు.. వాళ్ళ గురించి నీకేమైనా తెలుసా అని అడుగతుంది. తెలుసు చూపిస్తానంటూ ఒక గదిలోకి తీసుకొని వెళ్లి బయట నుండి తాళం వేస్తాడు వాడు.. చూసారా అత్తయ్య అందుకే ఎవరిని నమ్మొద్దనేది అయిన వినలేదని ఇద్దరు కోడళ్ళు అత్తపై కోప్పడతారు. ఆ తర్వాత అప్పుడే శ్రీవల్లి వస్తుంది. ఈ తాళం తియ్యమని అంటుంది. దాంతో తాళం పగులగొడుతుంది. వాళ్ళు బయటకు వస్తారు. నువ్వేంటి ఇక్కడ అని వేదవతి ఆడుగగా.. ఏం ఉంది., ఎప్పుడు మనల్ని ఫాలో అవుతూనే ఉంటుంది కదా అని నర్మద అంటుంది. ముగ్గురు కోడళ్ళు అత్త కలిసి శోభ గురించి వెతకుతూ వెళ్తారు.
మరొకవైపు రామరాజు దగ్గరికి సాగర్, చందు వస్తారు. లాయర్ ఎక్కడ అని రామరాజు అడుగగా రాలేదు తమ్ముడు ఈ కేసు నుండి బయటకు వచ్చేలా లేదని వాళ్ళు అంటుంటే.. రామరాజు ఇంకా బాధపడతాడు. ఆ తర్వాత అత్తాకోడళ్ళు శోభ గురించి వెతుకుతూ ఉంటారు. ప్రేమ ఒక దగ్గర కూర్చొని ధీరజ్ గురించి ఎమోషనల్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.