English | Telugu

Karthika Deepam2 : కలిసిపోయిన దశరథ్, సుమిత్ర.. పోలీస్ స్టేషన్ లో దీప!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -502 లో....కార్తీక్ తో దశరథ్ మాట్లాడతాడు. నేను సుమిత్ర విషయంలో తప్పు చేసానని పశ్చాతాపడుతుంటే సుమిత్ర విని వెళ్ళిపోతుంది. సుమిత్ర వెళ్లడం కార్తీక్ చూస్తాడు.. మరొకవైపు కార్తీక్ ఇంకా ఫోన్ చెయ్యలేదని శివన్నారాయణ వెయిట్ చేస్తుంటే.. అప్పుడే పారిజాతం వచ్చి శివన్నారాయణకి చిరాకు తెప్పిస్తుంది.

మరొకవైపు సుమిత్ర వెళ్లిపోతుంటే కార్తీక్ చూసి..అత్త ఆగు., ఎక్కడికి వెళ్తున్నావని అడుగుతాడు. నేను మీ మావయ్యకి ఎదరుపడలేనని సుమిత్ర అంటుంది. అప్పుడే సుమిత్ర అంటూ దశరథ్ వస్తాడు. ఇద్దరు ఎమోషనల్ అవుతారు. నువ్వు ఎక్కడికి వెళ్లడం లేదు.. ఇంటికి వస్తున్నావ్ అంతే అని దశరథ్ అంటాడు. దీప ఎక్కడా అని సుమిత్రని కార్తీక్ అడుగుతాడు. నేను ఇంట్లో ఎవరికి చెప్పలేదని సుమిత్ర అనగానే అవునా దీప ఫోన్ చేసి ఉంటుంది.. ఫోన్ కార్ లో ఉందని ఫోన్ తీసుకొని దీపకి ఫోన్ చేస్తాడు. దీప ఫోన్ జ్యోత్స్న తీసుకొని మాట్లాడుతుంది. మా మమ్మీని కిడ్నాప్ చేసినందుకు కంప్లైంట్ ఇచ్చాను.. దీప పోలీస్ స్టేషన్ లో ఉందని చెప్తుంది. మర్యాదగా ఇంటికి పంపించమని కార్తీక్ అంటాడు. అది జరగదని జ్యోత్స్న అంటుంది .

ఇంకా పావుగంట అక్కడే ఉండమని కార్తీక్ అనగానే వెయిట్ చేస్తానని జ్యోత్స్న అంటుంది. దశరథ్, సుమిత్రని తీసుకొని కార్తీక్ గుడి నుండి బయల్దేరతాడు. మరొకవైపు బావ ఇంకా రావడం లేదేంటని జ్యోత్స్న అనుకుంటుంది. అప్పుడే శివన్నారాయణ, పారిజాతం ఎంట్రీ ఇస్తారు. తాత కరెక్ట్ టైమ్ కి వచ్చావని జ్యోత్స్న అంటుంది. నా కూతురు(కాంచన)ని పోలీస్ స్టేషన్ కి రప్పిస్తారా అని జ్యోత్స్న పై శివన్నారాయణ కోప్పడతాడు. నేనేం అత్త(కాంచన) తీసుకొని రాలేదు తనే వచ్చిందని జ్యోత్స్న అంటుంది. నా కొడుకు లేని టైమ్ చూసి కోడలిని పోలీసులు తీసుకొని వెళ్తుంటే.. నేను చూస్తూ ఎలా ఊరుకోను.. తన వెంటే వచ్చానని కాంచన అంటుంది. శభాష్ నా కూతురు అనిపించుకున్నావని శివన్నారాయణ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.