English | Telugu
నీ అందానికి ఇన్సూరెన్స్ కట్టావా?.. సుజాతను అడిగిన రాకేష్
Updated : Jan 1, 2024
ఎక్స్ట్రా జబర్దస్త్ నెక్స్ట్ వీక్ ప్రోమోలో ఒక్కో స్కిట్ ఒక్కో రేంజ్ లో ఉండబోతోంది. ఆ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ చేశారు మల్లెమాల టీమ్. ఇందులో రాకింగ్ రాకేష్, జోర్దార్ సుజాత టీమ్ లో పంచ్ లు మాములుగా పేలలేదు. రాకేష్ స్టేజి మీదకు వస్తూనే "అరేయ్ సుజి నువ్వు ఇన్సూరెన్స్ కట్టావా" అనేసరికి సుజాత లేడీ పోలీస్ గెటప్ లో వచ్చి "కారుకా? బండికా?" అని అనుమానంగా అడిగింది. దాంతో రాకేష్ "నీ అందానికి రా" అని అనేసరికి వెనక పోలీస్ గెటప్ లో ఉన్న జ్ఞానేశ్వర్ అనే కమెడియన్ "అరేయ్ ఎందుకురా మనకు అవసరామారా" అనేసరికి రాకేష్ సైలెంట్ అయ్యాడు. "అరేయ్ సుజి ఎందుకురా అంత టెన్షన్ పడుతున్నావ్" అని రాకేష్ అడిగేసరికి "రేపు కమిషనర్ వస్తున్నాడు. ఆ క్రిమినల్ లేకపోతె నాకు ప్రమోషన్ ఇవ్వడు " అని ఏడ్చేసారికి "ఎందుకురా మీలాంటి అందమైన అమ్మాయిలనే ఇలా చేస్తారు" అని రాకేష్ అడిగేసరికి " హే ఆపు అందం అందం అంటాం..అందం లేకుండానే అన్నిసార్లు చెప్తున్నావ్ అందం ఉంటె ఆగవేమో మరి" అని జ్ఞానేశ్వర్ అనేసరికి రాకేష్ గమ్మున చూస్తూ ఉన్నాడు.
ఇక బులెట్ భాస్కర్ స్కిట్ లో ఎప్పుడూ ఏదో ఒక స్పెషలిటీ పెడుతూ ఉంటాడు. ఇక ఇప్పుడు మహేష్ బాబు నటించిన అతడు మూవీని స్పూఫ్ గా చేసి చూపించాడు. అందులో ఫోన్ చేసి బాజిరెడ్డితో మాట్లాడాలి అనేసరికి భగవాన్ రెడ్డితో మాట్లాడు అన్నారు జడ్జి కృష్ణభగవాన్. బులెట్ భాస్కర్ ఇంకా రెచ్చిపోయి "నేను బాజిరెడ్డితో మాట్లాడాలి" అనేసరికి "బాజిరెడ్డికి డబ్బింగ్ చెప్పేది నేనే" అన్నారు భగవాన్. అలాగే ఇమ్మానుయేల్ టీమ్ అంతా కలిసి చిరంజీవి నటించిన అన్నయ్య మూవీని స్పూఫ్ గా చేసి చూపించారు. ఇలా ఈ వారం ఒక్కో స్కిట్ ఒక్కో రేంజ్ లో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయబోతోంది.