English | Telugu
హోస్ట్ పోస్ట్ నుంచి తప్పిస్తానన్న కళ్యాణ్ రామ్.. షాకైన సుమ
Updated : Dec 31, 2023
సుమ అడ్డా షోలో ఈ వారం నందమూరి కళ్యాణ్ రామ్ సుమ మీద పంచులు మీద పంచులు వేసి ఫుల్ ఎంటర్టైన్ చేశారు. ఈ వారం షోకి డెవిల్ మూవీ టీమ్ నుంచి కళ్యాణ్ రామ్, సంయుక్తా మీనన్, శ్రీకాంత్, షఫీ వచ్చారు. ఐతే ఇందులో అందరితో గేమ్స్ ఆడించింది సుమ. ఐతే అందరూ మాట్లాడుతూ ఉన్నారు కానీ శ్రీకాంత్ మాత్రం అసలు మాట్లాడలేదు "వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నా ఆయన మాట్లాడ్డం లేదు అందుకే పాటపాడిద్దాం" అనేసరికి "వెరీ గుడ్" అంది సంయుక్త మీనన్.
ఇంతలో కళ్యాణ్ రామ్ మధ్యలో వచ్చి "డెవిల్ సినిమా గురించి అడగండి బాగా చెప్తారు..ఆయన ఎక్స్పీరియెన్స్, ఈ సినిమా మొత్తం గురించి స్క్రిప్ట్ గురించి అడగండి అంటూనే అబ్బా నేనే క్వశ్చన్ అడిగేసాను" అన్నాడు కళ్యాణ్ రామ్. ఇక సుమ ఫీలైపోయింది "అంతేనండి ఈమధ్య కాలంలో హీరోలంతా హోస్టులు ఐపోయి మా పొట్ట కొట్టేస్తున్నారు. మీరు కూడా రేపో మాపో ఐపోతారు హోస్ట్" అని సుమ అనేసరికి "అమ్మో మనకు అంత టాలెంట్ లేదు" అని కౌంటర్ వేసాడు కళ్యాణ్ రామ్. "హనుమంతుడికి తన బలం తెలీనట్టు..మీకు మీ బలం తెలీదు మీరు కూడా హోస్ట్ గా చేసేస్తారు" అని సుమ చెప్పేసరికి "మీ ఆశీర్వాదాలు నిజమైతే మిమ్మల్ని హోస్ట్ ప్లేస్ నుంచి తప్పించి నేను మీ ప్లేస్ లో హోస్ట్ గా నేను వస్తే బాగుంటుంది అని కోరుకుంటున్నా" అంటూ సుమ పోస్ట్ కి ఎసరు పెట్టారు కళ్యాణ్ రామ్. దాంతో సుమకు ఎం సమాధానం చెప్పాలో తెలీక సైలెంట్ ఐపోయింది.
తర్వాత శ్రీకాంత్ మాట్లాడుతూ "ఉదయాన్నే కాల్ షీట్ ఉంటె గంట ముందే వచ్చి కూర్చుంటారు కళ్యాణ్ రామ్" అని శ్రీకాంత్ చెప్పేసరికి "మీరు కళ్యాణ్ రామ్ గారితో పెట్టుకోకండి..ఎర్లీ మార్నింగ్ షెడ్యూల్ ఉంటె ముందు రోజు రాత్రే వెళ్లే సెట్ లో నిద్రపోండి" అని సుమ శ్రీకాంత్ కి సలహా ఇచ్చింది.