English | Telugu
Bigg Boss 9 Telugu: నీ ఇన్నర్ ఫీలింగ్ నాకెందుకయ్యా.. డీమాన్ ని ఇరికించేసిన నాగార్జున!
Updated : Nov 30, 2025
శనివారం వచ్చిందంటే చాలు బిగ్ బాస్ ఆడియన్స్ కి పండగే.. ఎందుకంటే నాగార్జున వస్తాడు.. హౌస్ లో ఎవరెవరు ఏఏ మిస్టేక్స్ చేశారో చెప్తూ ఒక్కొక్కరికి వార్నింగ్ ఇస్తాడు. ఇది చూడటానికి ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు. నాగార్జున ఫుల్ ఫైర్ తో వచ్చి సంజనని క్షమాపణలు చెప్పేలా చేశాడు. ఆ తర్వాత భరణి, తనూజ, దివ్యల మధ్య సాగుతున్న గొడవలకి ఫుల్ స్టాప్ పెట్టమని చెప్పాడు. ఇక రీతూ, డీమాన్, కళ్యాణ్ ల మధ్య జరిగిన గొడవని మొదలెట్టాడు నాగార్జున.
డీమాన్ పవన్ నామినేషన్ మధ్యలోకి నువ్వు ఎందుకు వెళ్ళావ్ కళ్యాణ్ అని నాగార్జున అడుగగా.. ఆ కోపంలో అలా మాట్లాడాను సర్.. సారీ చెప్తున్నానని కళ్యాణ్ అన్నాడు. ఇది మళ్ళీ రిపీట్ చేయోద్దని నాగార్జున చెప్పాడు. ఇక అప్పుడే మధ్యలో డీమాన్ పవన్ మాట్లాడాడు.. నేను కళ్యాణ్‌తో మాట్లాడుతుంటే.. మధ్యలో నువ్వు దూరుతున్నావేంటి మరి ఈ మధ్యలోకి దూరడం సంజనా టైమ్‌లో లేదా.. అప్పుడేం అయ్యావ్.. సర్లే ఇప్పుడేం చెప్పాలనుకుంటున్నావ్ చెప్పమని నాగార్జున అన్నాడు.
అదే సర్.. నేను ఓకే చెప్పలేదు.. వీళ్ల డిస్కషన్‌లో నా పేరు తీసుకుని వచ్చారు.. దానికి నేను బాధపడి వెళ్లిపోయానని డీమాన్ పవన్. మరి ఇందాక డిస్కషన్‌లో లేను అన్నావ్ కదా అని నాగార్జున అడిగితే.. డిస్కషన్ రెండు సార్లు జరిగింది సర్.. అప్పుడు ఉన్నాడంటూ రీతూ మధ్యలోకి వచ్చి మాట్లాడింది. ఇప్పుడే కదా నీకు చెప్పా.. నువ్వు పవన్ కోసం లాయర్ పని చేస్తువా అని ఫైర్ అయ్యాడు. లేదు సర్.. నా ఇన్నర్ ఫీలింగ్ చెప్తున్నానని డీమాన్ అన్నాడు.
నీ ఇన్నర్ ఫీలింగ్ ఎవడికి కావాలయ్యా అని నాగార్జున అన్నాడు. టీమ్ కోసం ఆడదామని కళ్యాణ్ అంటే నువ్వు ఓకే అన్నావని అంటున్నాడు.. అన్నావా లేదా నాగార్జున అని అడుగగా.. లేదు సర్..చూస్తూ ఉన్నానని డీమాన్ అన్నాడు. ఇక ఆ వీడియో ప్లే చేశారు. అక్కడ క్లియర్‌గా కళ్యాణ్ లాస్ట్ వరకూ మనం బ్లూటీమ్ కే సపోర్ట్ చేయాలని చెప్పాడు. ఇక ఆ తర్వాత రీతూ, డీమాన్ , నాగార్జున మధ్య కాసేపు డిస్కషన్ జరిగింది.
ఫైనల్ గా డీమాన్ ది తప్పు అన్నట్టుగా నాగార్జున పోట్రే చేశాడు. రీతూ, డీమాన్, పవన్ కళ్యాణ్ ఫోటోలని చింపేశాడు. అయితే సంజన చేసిన పనికి తన ఫోటో ముందుగానే చింపేశాడు నాగార్జున.