English | Telugu
రియల్ పోలీస్ ముందే నకరాలు చేసి హైపర్ ఆది
Updated : Nov 3, 2023
ఢీ షో నెక్స్ట్ వీక్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇక ఈ షోకి పొలిమేర 2 మూవీ టీం వచ్చింది. ఇక ఎప్పటిలాగే హైపర్ ఆది తన మార్క్ కామెడీతో ఎంట్రీ ఇచ్చాడు. స్టేజి మీదకు పోలీస్ డ్రెస్ వేసుకుని లాఠీ పట్టుకుని వచ్చాడు. "హా అగ్ని" అనే సాయి కుమార్ డైలాగ్ చెప్పేసరికి హోస్ట్ ప్రదీప్ ఆది చుట్టూ తిరిగి "ఎక్కడంటుకుంది అగ్ని" అని కౌంటర్ వేసేసరికి " ఏయ్" అన్నాడు ఆది. "కంప్లైంట్స్ ఏమున్నా చెప్పండి నేను తీరుస్తా" అన్నాడు ఆది.
"నిన్న నైట్ నా నిద్ర పోయింది" అని ప్రదీప్ చెప్పేసరికి "హమ్మో టెన్షన్" అన్నాడు. "సర్ మాకు పోయినా పెట్టుకుంటారా" అని శేఖర్ మాస్టర్ అడిగేసరికి "నీకు పోయినవి నేను పట్టుకోలేను" అని ఆది కామెడీ డైలాగ్ చెప్పి నవ్వించాడు. ఇక సెట్ బయట కూర్చున్న ఇద్దరు రియల్ పోలీసులను చూసి "మీరు కూడా అగ్ని ఏనా" అని ఆది అడిగేసరికి "ఆయన ఒరిజినల్ పోలీస్" అన్నాడు ప్రదీప్..ఆ మాటకు షాకై " మీ పేరేంటి సర్.. ఏ ఏరియా మీది " అని ఆది అడిగాడు.." వివేక్ రెడ్డి" అని ఆ పోలీస్ ఆన్సర్ చెప్పాడు.
ఇక డాన్స్ విషయానికి వస్తే నలుగురు సెమి ఫైనలిస్టులు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ డాన్స్ పెర్ఫార్మెన్సెస్ తో అదరగొట్టారు. ఇక ఈ టీమ్స్ నుంచి ఒక టీమ్ ని ఎలిమినేట్ చేయాల్సిన టైం వచ్చేసరికి శేఖర్ మాస్టర్ ఒక టాస్క్ ఇచ్చాడు. "ఏ టీమ్ ఐతే ఫైనల్ కి వెళ్ళదు అనుకుంటారో వాళ్ళ ఫ్లాగ్ తీసి మీ పక్కన పెట్టుకోండి" అని చెప్పేసరికి అన్ని టీమ్స్ వాళ్ళ వాళ్ళ ఫ్లాగ్స్ ని వాళ్ళ పక్కనే పెట్టుకున్నారు. ఇక మెజారిటీ ఓట్లు ఎక్కువగా ఓరుగల్లు వీరులు టీమ్ కె పడ్డాయి అని అనౌన్స్ చేసాడు ప్రదీప్. ఇక గ్రీష్మ టీమ్ కూడా డాన్స్ పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టింది. ఐతే శేఖర్ మాస్టర్ అనవసరంగా ఎక్కువ అక్రోబాట్స్ చేసినట్టు అనిపించింది అంటూ కామెంట్ చేశారు. మరి ఏ టీం ఎలిమినేట్ అవుతుందో ఏ టీమ్స్ ఫైనల్స్ కి వెళ్తాయో నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ లో తెలిసిపోతుంది.