English | Telugu
ఫెయిర్ గేమ్ ఆడాలంటూ శివాజీ వార్నింగ్.. గౌతమ్ కృష్ణకి ఎథిక్స్ లేవా?
Updated : Nov 3, 2023
బిగ్ బాస్ సీజన్-7 లో కంటెస్టెంట్స్ మధ్య హీటెడ్ ఆర్గుమెంట్స్ టాస్క్ లో కొనసాగుతున్నాయి. నిన్న జరిగిన టాస్క్ లో రతిక, అమర్ దీప్ ల మధ్య మాటల యుద్ధం జరిగింది. కాసేపటి దాకా ఇద్దరు గేమ్ గురించి గొడవ పడ్డారు.
టాస్క్ లో ఎదవ డ్రామాలు, ఫౌల్ గేమ్ ఆడకూడదని తెలియదా అంటూ అమర్ దీప్ పై ఇష్టమొచ్చినట్టు మాట్లాడటంతో.. నా గేమ్ ఇంతే, నా స్ట్రాటజీ ఇంతే బాల్స్ కోసం ఏమైనా చేస్తా అన్నట్టుగా అమర్ దీప్ మాట్లాడాడు. ఆ తర్వాత టాస్క్ ముగిసిందని ఎవరి దగ్గర ఉన్న బాల్స్ వారు దాచుకోమని బిగ్ బాస్ చెప్పాడు. ఆ తర్వాత గౌతమ్, టేస్టీ తేజ కలిసి శివాజీ టీమ్ దగ్గర ఉన్న బాల్స్ ని తీసుకెళ్ళాలని చూస్తే. నా దగ్గరి బాల్స్ జోలికి వస్తే తొక్క తీస్తా అని శివాజీ అన్నాడు.
ఆ తర్వాత టేస్టీ తేజ వచ్చి.. అన్న ఇది గేమ్, బాల్స్ ని మీరు కాపాడుకోవాలని ఎందుకు చెప్తాడని అన్నాడు. ఫౌల్ గేమ్ ఆడొద్దు, ఫెయర్ గా ఆడండమని బిగ్ బాస్ చెప్పాడని శివాజీ చెప్పాడు. ఇక ఇలా అన్నాడని టేస్టీ తేజ వెళ్ళి గౌతమ్ కృష్ణకి చెప్పగా.. అతను శివాజీ దగ్గరకు వచ్చి మేం బాల్స్ తీసుకుంటాం. మీరు కాపాడుకోండని గౌతమ్ కృష్ణ అన్నాడు.
దొంగతనం అంటే దొంగతనం కాదన్నా, ఇది ఒక గేమ్. మీరు సీరియస్ గా తీసుకున్నారు. పెళ్ళిలో చెప్పులు దాచేస్తారు కదా అది గేమ్ దొంగతనం కాదు కదా అని గౌతమ్ అనగా.. ఇది పరమ వరెస్ట్ లాజిక్. దీనికి నువ్వు చెప్పినదానికి అసలు సంబంధం ఉందా. మరి ఇది గేమ్ కదా? బిగ్ బాస్ హౌస్ లో ఉన్నది ఎందుకని గౌతమ్ అడుగగా.. దొంగతనాలు చేయడానికా అని శివాజీ అన్నాడు. మీ తెలివితో పాటు, ఫిజికల్ గా కూడా ఆడమని బిగ్ బాస్ ఎందుకు చెప్పాడని గౌతమ్ అన్నాడు. చెయ్యి ఉంది కదా అని చేయి కోస్తావా ఏంటి అని శివాజీ అడిగాడు. ఇది మా స్ట్రాటజీ అన్న అని గౌతమ్ అనగా.. రేయ్ నువ్వు డాక్టర్ వి , క్యారెక్టర్, ఎథిక్స్ ముఖ్యం ఫెయిర్ గేమ్ ఆడండి అంటూ శివాజీ అన్నాడు. నేను బాల్స్ ఉన్న సంచులని అక్కడే పెడతా ఎవరు తీసుకుంటారో తీసుకోండి అని శివాజీ చెప్పేసి వెళ్ళిపోయాడు.