English | Telugu
ఇంతమంది అందమైన అమ్మాయిలు ఉన్నారా ?
Updated : Nov 3, 2023
జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ పార్ట్ 2 ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ ప్రోమో మంచి కలర్ ఫుల్, నటీ నటుల హంగామాతో మంచి మస్తీని అందించడానికి 5 వ తేదీ ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఆడియన్స్ ముందుకు రాబోతోంది. "అందమైన అమ్మాయిలను చూసిన తర్వాత నాకు షార్ట్ సర్క్యూట్ కొట్టింది" అన్నాడు.."మీకు ఎప్పుడైనా టైం దొరికినప్పుడు సీరియల్స్ చూస్తారా" అని ప్రదీప్ అడిగేసరికి "నీ మీద ఒట్టేసి నిన్ను చూస్తా" అని కామెడీ చేసాడు
ఆర్జీవీ. "మా జీ తెలుగు హీరోయిన్స్ ఇక్కడ ఉన్నారు" అని ఆర్జీవీతో యాంకర్ రష్మీ చెప్పేసరికి "నేను అందుకే వచ్చాను" అని ఆర్జీవీ అనడం ఆ తర్వాత స్టేజి మీదకు హీరోయిన్స్ అంతా ఒక్కొక్కరిగా వచ్చి షాక్ హ్యాండ్ ఇచ్చారు. "హైదరాబాద్ లో ఇంతమంది అందమైన అమ్మాయిలు ఉన్నారా ఎప్పుడూ నాకు తెలీదు..తర్వాత ఎవర్ గ్రీన్ సుమ, రాజీవ్ కనకాల వచ్చారు.."మీ ఇద్దరి పెళ్లై పాతికేళ్ళు అయ్యిందా" అని ప్రదీప్ అనేసరికి " చెప్పు రాజా" అంది సుమ. "నువ్వే మాట్లాడు... మాట్లాడాక ఏమన్నా మిగిలుంటే నేను మాట్లాడతాను" అన్నాడు రాజీవ్ .
తర్వాత ఇద్దరికీ పూల దండలు తేవడంతో ఇద్దరూ మళ్ళీ దండలు మార్చుకున్నారు" రాజా చెప్పు ఇప్పటికైనా నీకు అవకాశం ఉంది" అంది సుమ " ఇప్పుడు నువ్వు కాదన్నా గాని చేసేదేమీ లేదు" అని కౌంటర్ వేశారు రాజీవ్ కనకాల.. ఇక ఈ షోకి స్పెషల్ గా నాని వచ్చాడు. రాగానే " నా సినిమాల్లో ఎప్పుడూ ఒక మాట వినబడేది నాని అంటే మన కుర్రాడే అని..అదే టీవీ స్పేస్ లో ఎక్కువ వినిపించే పేరు ప్రదీప్" అని కాంప్లిమెంట్ ఇచ్చారు. తర్వాత నిరుపమ్ అండ్ టీమ్ నాన్న బ్యాక్ డ్రాప్ తో ఒక స్కిట్ చేసేసరికి నాని కళ్ళు చెమర్చాయి. ఇలా ఈ ఈవెంట్ ఆదివారం వచ్చి ఎంటర్టైన్ చేయబోతోంది.