English | Telugu

నిజం చెప్పేసిన రిషి.. శైలేంద్ర అగ్రిమెంట్ ప్లాన్ జగతి పరిష్కరించగలదా?

నిజం చెప్పేసిన రిషి.. శైలేంద్ర అగ్రిమెంట్ ప్లాన్ జగతి పరిష్కరించగలదా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -867 లో... ఏంజెల్ రిషిల పెళ్లి ముహూర్తం పెట్టించడానికి విశ్వనాథ్ అంత సిద్ధం చేస్తాడు. రిషి గురించి మీకు తెలియని విషయాలు చాలా ఉన్నాయని మహేంద్ర అనగానే.. మీకు రిషి గురించి ఏం తెలుసో చెప్పండని విశ్వనాథ్ అంటాడు. రిషి తన  గురించి తాను చెప్పుకుంటేనే బాగుంటుందని మహేంద్ర అంటాడు.

ఆ తర్వాత రిషిని విశ్వనాథ్ అడుగుతాడు. నాకు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, మీకు మేరే నాకు ఇష్టమని ఉహించుకున్నారు‌‌. నాకు ఇష్టం లేదని రిషి చెప్పేసి తన మనసులోని భారాన్ని దించుకుంటాడు. మీకు ఎప్పుడు నాకు ఈ పెళ్లి ఇష్టమనలేదని రిషి అంటాడు. ఈ పెళ్లి ఎందుకు వద్దు అంటున్నావ్ ? నాకు నేనుగా ఈ పెళ్లి చేసుకుంటా అని చెప్పినందుకు లోకువ అయ్యనా?  నా ఇష్టం తెలుసుకొని విశ్వం నిన్ను అడిగినందుకు లోకువ అయ్యాడా? అసలెందుకు వద్దంటున్నవ్ రీజన్ చెప్పమని రిషిని ఏంజెల్  అడుగుతుంది. మరొక వైపు శైలేంద్ర, సౌజన్య రావు మతో చేసుకున్న అగ్రిమెంట్ గురించి ఫణింద్రతో మాట్లాడుతాడు. మీరు నేను అడిగినప్పుడు డబ్బులు ఇవ్వకుంటే, ఈ కాలేజీనీ సొంతం చేసుకుంటానని అగ్రిమెంట్ రాసి ఇచ్చారు. మీరు ఇప్పుడు డబ్బులు ఇచ్చే సిచువేషన్ లో లేరు కదా? ఇక కాలేజీ నాదే అని సౌజన్య రావు అంటాడు. ఆ మాటకి సౌజన్యరావుపై ఫణీంద్ర కోప్పడతాడు. మరొక వైపు ఎందుకు పెళ్లి వద్దంటున్నావ్ అని రిషిని పదే పదే అడిగేసరికి.. రిషికి కోపం వచ్చి నాకు పెళ్లి అయింది. నా భార్య బతికే ఉందని రిషి చెప్పగానే.. వసుధారతో పాటు అక్కడే ఉన్న జగతి, మహేంద్ర హ్యాపీగా ఫీల్ అవుతారు. మరొక వైపు ఏంజిల్, విశ్వనాథ్ ఇద్దరు షాక్ అవుతారు. అయితే ఈ విషయం నాకెందుకు చెప్పలేదని ఏంజిల్ అడుగుతుంది.  ఆ తర్వాత ఇన్ని రోజులుగా నీ భార్యకి ఎందుకు దూరంగా ఉంటున్నావంటూ అన్ని ప్రశ్నలు వేస్తూ రిషికి ఏంజిల్ చిరాకు తెప్పిస్తుంది.

మరొక వైపు ఫణింద్రకి సౌజన్య రావుతో చేసిన అగ్రిమెంట్ తెలిసి తనపై కోప్పడతాడు. అప్పుడే దేవయాని వచ్చి.. అగ్రిమెంట్ గురించి అడుగుతుంది. నువ్వేం కంగారుపడకని దేవయానికి ఫణీంద్ర చెప్తాడు. ఈ ప్రాబ్లమ్ కి సొల్యూషన్ జగతి చెప్పగలదని ఫణింద్ర అనగానే  ఫోన్ చెయ్యండని సౌజన్యరావు అంటాడు. అప్పుడే జగతికి ఫణీంద్ర ఫోన్ చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.