English | Telugu
అప్పులో వచ్చిన మార్పేంటి.. వాళ్ళిద్దరు ఎప్పటిలాగే!
Updated : Sep 14, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -200 లో... అనామికకి కళ్యాణ్ తన గదిని చూపిస్తాడు. కాసేపటికి ఇక నేను వెళ్తాను.. నేను వెళ్లాక, నీకు ప్రశ్నల యుద్ధం ఉంటుంది. అది చేయడానికి మీ వాళ్ళు అంత రెడిగా ఉన్నారని కళ్యాణ్ తో అనామిక అంటుంది.
మరొక వైపు కావ్యని కూల్ చేయడానికి రాజ్ తిప్పలు పడుతుంటాడు. కిచెన్ లో స్వీట్ చేస్తున్న కావ్య దగ్గరికి రాజ్ వచ్చి.. ఏమైనా హెల్ప్ చెయ్యాలా అని అడుగుతాడు. అక్కడ తిట్టేసి, ఇప్పుడు హెల్ప్ చేయడనికి వచ్చారా అని కావ్య అనగానే.. అది చెప్పడానికే వచ్చానని రాజ్ వివరణ ఇస్తుంటే కావ్య వినదు. సరే నేను వంట చేస్తానంటూ స్వీట్ లో షుగర్ కి బదులు సాల్ట్ వేస్తాడు. ఆ తర్వాత రాజ్ వేసింది షుగర్ కాదు సాల్ట్ అని తెలుసుకుంటాడు. అప్పటికే కావ్య స్వీట్ పట్టుకొని అనామిక కి ఇస్తుంటే ఆపుతాడు. ఎందుకు ఇలా వద్దని అంటున్నారని కావ్య అడుగుతుంది. తను డైట్ లో ఉన్నట్లు ఉందని కవర్ చేసి అనామిక స్వీట్ తినకుండా రాజ్ ఆపుతాడు. ఆ తర్వాత కాసేపటికి అనామిక వెళ్ళిపోతుంది. ఇంట్లో అందరు కళ్యాణ్ వంక అదోలా చూసేసరికి ఆ అమ్మయికి నాకు మధ్య మీరు అనుకుంటునట్లు ఏం లేదని చెప్పి, కళ్యాణ్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కావ్య స్వీట్ తీసుకొని అందరికి ఇస్తుంది. అందరూ కావ్యని షుగర్ కి బదులు, ఇందులో సాల్ట్ వేసావని అంటారు. ఆ పని నాది కాదు రాజ్ ది అని కావ్య చెప్తుంది. నువ్వు కిచెన్ లో ఏం చేస్తున్నావని రాజ్ ని రుద్రాణి అడుగుతుంది. ఈ మధ్య కావ్య ఎక్కడ ఉంటే రాజ్ అక్కడే ఉంటున్నాడని ధాన్యలక్ష్మి అంటుంది.
మరొక వైపు అప్పు వాళ్ళ ఫ్రెండ్ కాల్ చేస్తే రానని చెప్తుంది. నువ్వు చేంజ్ అయ్యవని తన ఫ్రెండ్ అంటాడు. ఆ తర్వాత కనకం అన్నపూర్ణ ఇద్దరు కూడా అదే మాట అంటారు. నాలో ఏం మార్పు వచ్చిందని అప్పు అనుకుంటుంది. మరొక వైపు కావ్యని కూల్ చెయ్యడానికి తను ఎక్కడ ఉందని చూస్తుంటే తాతయ్య దగ్గర ఉందని ధాన్యలక్ష్మి చెప్తుంది. ఎక్కుడ తాతయ్యకి జరిగిన గొడవ చెప్తుందోనని వెంటనే కావ్య దగ్గరకి వెళ్తాడు. ఆ తర్వాత ఏంటి తాతయ్య మందులు ఇన్ని ఉన్నాయని కావ్య అనగానే.. కావ్యని డైవర్ట్ చేస్తాడు రాజ్. మీరు ఇక్కడ నుండి వెళ్ళండని సితారామయ్య చెప్తాడు. ఆ తర్వాత గదిలోకి వెళ్లిన రాజ్ కావ్య ఇద్దరు ఎప్పటిలాగే టామ్ అండ్ జెర్రీ లా మాట్లాడుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.