English | Telugu

వాళ్ళ గది దగ్గరికి తీసుకెళ్ళిందనగానే రేవతి షాక్!


స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -253 లో.. కృష్ణ మురారిల జోలికి రాకూడదని కోపంగా చెప్తే వినట్లేదు ప్రేమగా చెప్పాలని రేవతి అనుకొని.. ముకుందని ప్రేమగా పలకరిస్తుంది. ఆ తర్వాత ముకుందని రేవతి పక్కకి తీసుకొని వెళ్లి మాట్లాడుతుంది. నువ్వు కృష్ణ, మురారీల జోలికి రాకు. వాళ్ళని సంతోషంగా ఉండనివ్వు. నీ ప్రేమని కృష్ణకి చెప్పకని రేవతి అంటుంది. కానీ ముకుంద వైఖరిలో ఎలాంటి మార్పు ఉండదు. ఎలాగైనా తన ప్రేమని దక్కించుకుంటానని, అలాగే కృష్ణకి ప్రేమ విషయం చెప్తానని ముకుంద చెప్తుంది. ముకుంద మొండిగా మాట్లాడేసరికి రేవతికి కోపం వచ్చి.. నువ్వు కనుక కృష్ణకి మీ ప్రేమ సంగతి చెప్తే నేను చూస్తూ ఊరుకోనంటూ రేవతి వార్నింగ్ ఇస్తుంది.

మరొకవైపు కృష్ణతో వీడియోలు తీసి తన ఛానెల్ లో అప్లోడ్ చెయ్యాలని మధు అనుకుంటాడు. నన్ను వీడియో తియ్యండని అలేఖ్య అనగానే.. కొంచెం కామెడీగా నిన్ను తిస్తే ఫోన్ సరిపోదని మధు అంటాడు. అప్పుడే షాపింగ్ కి రెడీ అయి వస్తున్న కృష్ణ, మురారిలని వీడియో తీస్తూ ఎంత బాగా వస్తున్నారని మధు అంటాడు. ఒక వీడియో తీద్దాం కృష్ణ అని మధు అనగానే.. ఒక షాపింగ్ వ్లాగ్ తీద్దామని మురారి అంటాడు. దానికి కృష్ణ సరే అంటుంది. ఆ తర్వాత అలేఖ్యని ముకుంద పక్కకి తీసుకొని వెళ్లి.. మధుని షాపింగ్ కి రాకుండా చూడని చెప్తుంది. మరొక వైపు మధుని మురారి పక్కకి తీసుకొని వెళ్లి.. నువ్వు ఎలాగైనా షాపింగ్ కి రా ఒకవేళ ముకుంద కృష్ణకి ప్రేమ గురించి చెప్పాలని ట్రై చేసిన మనం కవర్ చెయ్యొచ్చని మురారి అంటాడు. దానికి మధు సరేనంటాడు. ఇక అందరూ హాల్లోకి వచ్చి షాపింగ్ కి వద్దని అలేఖ్య, షాపింగ్ వెళ్తానంటూ మధు ఆర్గుమెంట్ చేసుకుంటారు.

ఆ తర్వాత కృష్ణ బ్యాగ్ కోసం లోపలికి వెళ్లి వస్తుంది. ఇక బయటకు వచ్చి కృష్ణ వ్లాగ్ సంబంధించిన ఇంట్రడక్షన్ ఇస్తుంటుంది. వీళ్ళింకా షాపింగ్ కి వెళ్లలేదా? ఈ మధు వాళ్ళని షాపింగ్ కి వెళ్ళనివ్వడం లేదా అని రేవతితో భవాని అంటుంది ‌. ఆ తర్వాత మధుని పిలుస్తుంది భవాని. అలా మధు లోపలికి వెళ్ళగానే కృష్ణ, మురారి, ముకుందలు షాపింగ్ కి వెళ్ళిపోతారు... ఆ తర్వాత ముకుంద తన ప్రేమ గురించి నాకు తెలియాలని కృష్ణ, మురారిల గది దగ్గరికి తీసుకొని వెళ్ళిందని భవాని చెప్పగానే రేవతి షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.