English | Telugu

Guppedantha Manasu : ఎండీగా రిషి.. మరోసారి శైలేంద్రని ఫూల్ చేశాడుగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'(Guppedantha Manasu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -1155 లో ... ఫణీంద్రకి దేవయాని ఫోన్ చేసి.. మీటింగ్ లో ఏం జరుగుతుంది? ఎవరు ఎండీగా నిర్ణయం తీసుకున్నారని అడుగుతుంది.ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఫణీంద్ర అంటాడు. శైలేంద్ర ఏం చేస్తున్నాడని దేవయాని అడుగగా.. వాడు ఇక్కడ లేడు.. ఎక్కడ ఏ రాచకార్యాలు వెలగపెడుతున్నాడో వాడికే ఫోన్ చేసి కనుక్కోమని ఫణీంద్ర కోపంగా ఫోన్ కట్ చేస్తాడు. నేను అనుకున్నదే కరెక్ట్.. శైలేంద్ర ఏదో ప్రాబ్లమ్ లో ఉన్నాడని దేవయాని అనుకుంటుంది. వెంటనే తన రూమ్ లోకి వచ్చి మనుకి వసుధార రాసిన లెటర్ ని ఫోటో తీసి శైలేంద్రకి పంపిస్తుంది.

అదంతా దూరం నుండి ధరణి చూస్తుంటుంది. మరొకవైపు మీటింగ్ లో అందరూ రిషిని ఎండీ గా ఉండాలని అంటారు. వసుధార గారు అన్నట్లు మీరు ఉండగా వేరొకరు ఎండీ పదవికీ తగరని బోర్డు మెంబర్స్ అంటారు. అందరు అనడంతో రిషి ఎండీగా ఉండడానికి ఒప్పుకుంటాడు. మరొకవైపు శైలేంద్ర ఫోన్ కి దేవయాని పంపిన లెటర్ ని మను చదివి షాక్ అవుతాడు. అది నిజం..వసుధార వెళ్లిపోయినప్పుడు నీకు ఆ లెటర్ రాసింది .. నేనే మార్చేసా అని శైలేంద్ర చెప్తాడు. మను ఆ లెటర్ చదివి షాక్ అవుతాడు. అప్పుడే దేవయాని ఫోన్ చేసి.. నువ్వు శైలేంద్రని కిడ్నాప్ చేసావని నాకు తెలుసు.. కానీ ఇప్పుడు శైలేంద్రని వదిలిపెట్టు.. మా కల నిజమయ్యే టైమ్.. నువ్వు ఏదైనా ఉంటే ఆ మహేంద్ర, అనుపమలతో తేల్చుకోమని దేవయాని అంటుంది. ఈ విషయం ఎవరితో చెప్పనంటేనే నేను వదిలి పెడతానని మను అనగానే.. ఎవరితో చెప్పమని దేవయాని అంటుంది. ఆ తర్వాత శైలేంద్రని మను వదిలిపెడతాడు.

అ తర్వాత శైలేంద్ర కాలేజీకీ వెళ్లి.. నేనొచ్చాను కదా ఇక ఎండీని ప్రకటించండి అని అనగానే ఆల్రెడీ ఎండీగా రిషి అని నిర్ణయం తీసుకున్నామని ఫణీంద్ర అనగానే.. అలా ఎలా అవుతాడని శైలేంద్ర అనగానే తనపై ఫణీంద్ర కోప్పడతాడు. ఇంత మోసం చేస్తాడా అని రిషిపై శైలేంద్ర కోపంగా ఉంటాడు. కాని రిషి నే రివర్స్ గా.. టైమ్ కి ఎక్కడికి వెళ్ళావ్ .. ఆ మేడమ్ నా పేరు చెప్పింది. అయినా నేను వద్దనన్నానంటూ శైలేంద్రని ఫూల్ ని చేస్తాడు రిషి. నువ్వు అయితే రేపు అయిన నన్ను చేస్తావ్ గా అంటూ శైలేంద్ర ధీమాగా ఉంటాడు. మరొకవైపు మహేంద్రనే నీ కన్నతండ్రి అని శైలేంద్ర చెప్పిన విషయాన్ని మను గుర్తుకుచేసుకుంటాడు. అ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.