English | Telugu
Bigg Boss 9 Telugu : దివ్య ఎమోషనల్.. భరణి అలా చేశాడేంటి!
Updated : Oct 29, 2025
బిగ్ బాస్ సీజన్-9 లో రోజుకొక ట్విస్ట్ జరుగుతుంది. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ అందరు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి నామినేషన్ ప్రక్రియ చేసి తర్వాత వెళ్లిపోయారు కానీ ఇద్దరు కంటెస్టెంట్స్ ని మాత్రం బిగ్ బాస్ హౌస్ లోకి పంపించాడు.. భరణి, శ్రీజ హౌస్ లో కి వెళ్లారు. వీళ్ళిద్దరిలో ఒక్కరు మాత్రమే హౌస్ లో ఉంటారని బిగ్ బాస్ చెప్పాడు. అయితే భరణి, శ్రీజ హౌస్ లోకి రాగానే అందరు షాక్ అవుతారు.
భరణి తన కుటుంబాన్ని ఎప్పటిలాగే కలిసి మాట్లాడాడు. ఇక నామినేషన్స్ అప్పుడు తనూజ తో మాట్లాడావ్ కానీ నాతో మాట్లాడలేదని భరణితో చెప్పుకుంటూ దివ్య ఎమోషనల్ అవుతుంది. ఆ తర్వాత తనూజ, సుమన్, దివ్య, రాము అందరితో గేమ్ ఇలా ఆడండి.. అలా ఆడండి అని చెప్తాడు. దివ్య పక్కకి వెళ్లి నాకు ఏదైనా చెప్పాలని ఉంటే నాకు సపరేట్ గా చెప్పండి.. అందరితో కాదని భరణితో దివ్య చెప్తుంది. ఆ తర్వాత భరణి, శ్రీజ ఇద్దరిలో.. వాళ్లలో ఏం మార్చుకోవాలి.. ఎందువలన హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యారో చెప్పండి అని కంటెస్టెంట్స్ కి బిగ్ బాస్ చెప్పాడు.
ఒక్కో కంటెస్టెంట్స్ వచ్చి ఒక్కో రీజన్ చెప్పారు. ఎక్కువగా భరణికి చెప్పారు. ట్రస్ట్ వద్దు.. బాండ్ వద్దు గేమ్ ఆడండి అని చెప్తారు. శ్రీజకి మాట్లాడడం వాదించడం తగ్గిస్తే బెటర్ అని చెప్తారు.. భరణి, శ్రీజ ఇద్దరిలో ఈ వారంలో ఎవరు తమని తాము ప్రూవ్ చేసుకుంటారో వాళ్లే హౌస్ లో ఉంటారు.. మిగతా కంటెస్టెంట్స్ బయటకు వస్తారు.. ఏ కంటెస్టెంట్ ఉంటారో.. చూడాలి మరి. భరణి ఉంటే 'బలగం-2' సిద్ధమతుందా లేక.. శ్రీజతో మాధురి 'జగడం' ఉండనుందా తెలియాలంటే రెండు రోజులు ఆగాల్సిందే.