English | Telugu

Gourav Gupta Remuneration: ఐదు వారాలకు గౌరవ్ రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

బిగ్ బాస్ సీజన్-9 లో పదో వారం డబుల్ ఎలిమినేషన్ జరిగింది. ఇందులో శనివారం నాటి ఎపిసోడ్ లో నిఖిల్ ఎలిమినేట్ అవ్వగా ఆదివారం నాటి ఎపిసోడ్ లో గౌరవ్ గుప్తా ఎలిమినేట్ అయ్యాడు. బిగ్ బాస్ హౌస్ కి అందరు తమ ట్యాలెంట్ చూపించడానికి వెళ్తారు కానీ గౌరవ్ మాత్రం తెలుగు నేర్చుకోవడానికి వెళ్ళినట్టుగా ఉంది.

వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన గౌరవ్.. చివరిగా ఎలిమినేట్ అయ్యాడు. హౌస్ లో ఏం జరిగినా, తనకి ఏం అనిపించినా దానిని కెమెరాల దగ్గరికి వచ్చి చెప్పేస్తుంటాడు గౌరవ్. కండబలం ఉంది కానీ బుద్ది బలం లేదు అని చాలామంది చాలా సందర్భాల్లో అంటారు. అది కచ్చితంగా గౌరవ్ కి ఆప్ట్ అవుతుంది. ఎందుకంటే తనకి ఎవరు ఏంటో అర్థం కాదు.. ఎవరి స్ట్రాటజీ ఏంటో తెలియదు.. కానీ తనకి తోచింది చేస్తుంటాడు. అంతా క్రమశిక్షణగా ఉండాలి.. రూల్స్ పాటించాలంటు రూల్స్ రామానుజన్ గా మాట్లాడుతుంటాడు. అయితే అ రూల్స్ అన్నివేళలా పనిచేయవు.. ఒక టాస్క్ ఇస్తే దానిని అర్ధ చేసుకోలేడు.. పైగా ఎవరైనా వివరిస్తే వారికి విరుద్ధంగా మాట్లాడతాడు గౌరవ్. అయితే హౌస్ లో తను ఎక్కువగా ఉంది నిఖిల్ తోనే.. అందుకేనేమో బిగ్ బాస్ మావ.. వీళ్ళిద్దరిని ఒకే వారం ఎలిమినేషన్ చేశాడు.

గౌరవ్ తెలుగులో మల్లి లాంటి టీవీ సీరియల్స్ తో పాపులర్ అయ్యాడు. గౌరవ్ కి వారానికి రెండు లక్షలు రెమ్యునరేషన్ అందుకున్నాడు. అంటే అయిదు వారాలకి గాను గౌరవ్ పది లక్షల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. బుల్లితెర నటులు నిఖిల్, గౌరవ్ ఇద్దరూ హౌస్ లో అంతగా కష్టపడకుండానే లక్షల్లో రెమ్యునరేషన్ తీసుకున్నారని తెలుస్తోంది. నిఖిల్ స్ట్రాంగ్ ప్లేయర్ కానీ రిజర్వ్ గా ఉంటాడు. హౌస్ లో ఏం జరిగినా స్టాండ్ తీసుకోడు అది అతని మైనస్.

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...