English | Telugu
రీతూ మనసు ముక్కులు చేసిన డీమాన్ పవన్.. అవన్నీ మన పర్సనల్!
Updated : Nov 18, 2025
ఇది ఎవరూ ఊహించనిది.. నిజమే.. బిగ్ బాస్ సీజన్-9 లో గడిచిన పది వారాల్లో ఇప్పటి వరకయ రీతూని డీమాన్ పవన్ నామినేట్ చేయలేదు. డీమాన్ ని రీతూ నామినేట్ చేయలేదు. కానీ ఫస్ట్ టైమ్ దాన్ని బ్రేక్ చేస్తూ కుండని బ్రేక్ చేసి మరీ రీతూని నామినేట్ చేశాడు డీమాన్ పవన్.
తనూజగా మొదటగా రెండు నామినేషన్లు చేసుకునే టోకెన్ ని డీమాన్ పవన్ కి ఇచ్చింది. దాంతో మొదటగా 'పవన్ కళ్యాణ్ పడాల' ని నామినేట్ చేశాడు. ఆ తర్వాత సెకెండ్ నామినేషన్ రీతూ అని చెప్పాడు. దాంతో భరణి, ఇమ్మాన్యుయల్, తనూజ, కళ్యాణ్ అందరు షాక్ అయిపోయారు. వాళ్లతో పాటు రీతూ కూడా అలాగే బిగుసుకుపోయింది. అరే ఏంట్రా ఇది అని రీతూ అనేలోపే.. నా దగ్గర పాయింట్లు ఉన్నాయని డీమాన్ పవన్ అన్నాడు. నేను నీతోనే ఉన్నాను.. ప్రతీ గేమ్ లో నీకు సపోర్ట్ గా ఉన్నాను.. కానీ నువ్వు నన్ను అర్థం చేసుకోకుండా ప్రతీదానికి నేను అలుగుతానని అంటావ్.. అసలు నేను మాట్లేది వినవు అని డీమాన్ పవన్ తన నామినేషన్ పాయింట్ చెప్పాడు. దాంతో రీతూ షాక్ అయింది. నువ్వు నాతో అరిచిన ప్రతీసారీ బయటకు ఎలా పోట్రే అవుతుందో అర్థం చేసుకో.. అంటు తన సెకెండ్ పాయింట్ పెట్టాడు డీమాన్. అవన్నీ మన పర్సనల్ అనుకున్నాను.. అందుకే మన మధ్య ఎన్ని ఉన్నా నేను నిన్ను నామినేట్ చేసి చెప్పలేదు పవన్ అంటు ఏడ్చేసింది రీతూ. ఇక రీతు ఏడుస్తుంటే డీమాన్ కంట్లో కూడా నీళ్లు తిరిగాయి. ఇక నామినేషన్ తర్వాత రీతూ గుక్కపెట్టి ఏడ్చేసింది . వాష్ రూమ్ దగ్గరికి వెళ్ళి రీతూ ఏడుస్తుంటే ఓదార్చడానికి సంజన వెళ్లింది. అయితే తనని అయిదు నిమిషాలు వదిలెయ్యమని చెప్తూ వాష్ రూమ్ లోకి వెళ్ళి గట్టిగా ఏడుస్తూ ఉంది. ఇక అదే విషయం డీమాన్ పవన్ కి చెప్పి వాష్ రూమ్ దగ్గరికి తీసుకొచ్చింది సంజన.
ఇక కాసేపటికి గార్డెన్ ఏరియాలో ఇద్దరు కూర్చొని మాట్లాడుకున్నారు. నేను ఒకటి అడిగినప్పుడు నువ్వు దానికి సమాధానం చెప్పకుండా.. అరుస్తావ్.. పట్టించుకోవని డీమాన్ అనగా.. వరిలేయ్ పవన్ అంటు రీతు అంది. ఇక డీమాన్ ఏదో అంటు ఉంటే.. వదిలెయ్ పవన్ అని గట్టిగా అరిచేసింది రీతూ.. నువ్వు అరవడం వల్ల నాది తప్పు లేకపోయినా నాదే తప్పు అవుతుందని అది బయటకు వెళ్తుందని డీమాన్ అన్నాడు. తనది తప్పు లేదని తనతో మాట్లాడటానికే ట్రై చేశాను.. కానీ నువ్వు ట్రస్ట్ లేదని చాలా హర్ట్ చేశావ్. ప్రతి క్షణం నేను నీ మంచే కోరుకున్నా. నేనైతే చాలా బాధపడుతున్నానని డీమాన్ పవన్ అన్నాడు. దాంతో నాతో మాట్లాడొద్దని తల బాదుకుని గట్టిగా అరిచింది రీతు. ఎందుకు అరుస్తున్నావ్.. నాకూ అవ్వడం లేదంటూ డీమాన్ పవన్ కూడా గట్టిగా అరిచాడు. ఇలా ఇద్దరి మధ్య ఫుల్ హీటెడ్ ఆర్గుమెంట్స్ జరిగాయి.