English | Telugu

తింటానికి తిండిలేక‌, దానిమ్మ పిందెల‌తో క‌డుపు నింపుకున్న గెట‌ప్ శ్రీ‌ను!

గెట‌ప్ శ్రీ‌ను గురించి ఇవాళ ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం చేయ‌న‌క్క‌ర్లేదు. జ‌బ‌ర్ద‌స్త్ షోతో క‌మెడియ‌న్‌గా అత‌ను వేరే లెవ‌ల్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. అత‌ని ఫ్యాన్ ఫాలోయింగ్ త‌క్కువేమీ కాదు. నాగ‌బాబు సైతం గెట‌ప్ శ్రీ‌ను న‌ట సామ‌ర్థ్యం గురించి గొప్ప‌గా మాట్లాడిన సంద‌ర్భాలు ఎన్నో. అలాంటి గెట‌ప్ శ్రీ‌ను జ‌బ‌ర్ద‌స్త్‌లోకి రాక‌ముందు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. తింటానికి తిండి లేక‌పోవ‌డంతో క‌డుపు మాడ్చుకున్న పూట‌లెన్నో.

ఇంట్లో వాళ్ల మీద ఆధార‌ప‌డ‌కూడ‌ద‌నుకొని ఉపాధి కోసం సొంతూరి నుంచి హైద‌రాబాద్ వ‌చ్చిన శ్రీ‌ను వాళ్ల పిన్ని వాళ్లింట్లో కొద్ది కాలం ఉన్నాడు. ప‌గ‌లంతా ప‌ని కోసం వెతుక్కోడం.. ఇంటికి వ‌చ్చి పిన్ని ఆప్యాయంగా పెట్టే భోజ‌నం చేసేవాడు. శ్రీ‌ను బ‌ట్ట‌లు కూడా ఆమే ఉతికేది. కొన్ని రోజుల త‌ర్వాత శ్రీ‌ను రియ‌లైజ్ అయ్యాడు. ఎంత పిన్ని, చిన్నాన్న‌లైనా వాళ్ల‌కు ఎంతైనా త‌ను భార‌మే క‌దా అనుకున్నాడు. దాంతో బ‌య‌ట‌కు వ‌చ్చేసి, మ్యాగీ అనే త‌న ఫ్రెండ్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిపోయాడు. ఇండ‌స్ట్రీలో శ్రీ‌ను మొట్ట‌మొద‌టి శ్రేయోభిలాషి, స్నేహితుడు అత‌నే. మ్యాగీ అప్పుడు అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా చేస్తున్నాడు.

మ్యాగీకి నాగోల్‌లో చిన్న స్థ‌లం ఉంది. అందులో ఓ మూల రేకుల షెడ్డు ఉండేది. అందులోనే ఇంకో మూల బాత్‌రూమ్ ఉండేది. దానికి త‌లుపు కాకుండా క‌ర్టెన్ అడ్డంగా ఉండేది. అక్క‌డ ఉంటూ వ‌చ్చాడు శ్రీ‌ను. మ్యాగీ కూడా ఇంట్లో వాళ్ల‌మీద ఆధార‌ప‌డ‌కూడ‌ద‌నుకొని వ‌చ్చిన‌వాడే. ఆ ఇద్ద‌రూ క‌లిసి నాగోల్ నుంచి హైద‌రాబాద్‌కు ఇంకో దిక్కున ఉండే మియాపూర్‌లో ఉండే మా కేబుల్‌కు వెళ్లేవారు. శ్రీ‌ను అక్క‌డ‌కు వెళ్లిన మొద‌టి ఆరు నెల‌ల కాలంలో ఇద్ద‌రి ద‌గ్గ‌రా డ‌బ్బులు ఉండేవి కావు. షోల ద్వారా చాలా త‌క్కువ డ‌బ్బులే వ‌చ్చేవి. దాంతో క‌డుపు నింపుకోడానికి రాత్రిపూట కిరాణా కొట్టు నుంచి బ‌న్స్ తెచ్చుకొని, మంచినీళ్ల‌లో వాటిని ముంచుకొని తిని, అలాగే ప‌డుకొనేవాళ్లు. స్ట‌వ్‌మీద బియ్యంపెట్టి, అందులో చింత‌పండు వేసుకొని, ఆ అన్నం తినేవాళ్లు.

ఒక‌సారి ప‌నిప‌డి మ్యాగీ వాళ్ల ఊరు నిర్మ‌ల్ వెళ్లాడు. ఆ టైమ్‌లో శ్రీ‌ను ద‌గ్గ‌ర ఒక్క రూపాయి కూడా లేదు. మ్యాగీని అడ‌గ‌డం మ‌ర్చిపోయాడు. మియాపూర్‌కు బ‌స్సులో వెళ్లాల‌న్నా రూపాయి లేదు. వాళ్ల ప‌క్కింట్లో ఒక దానిమ్మ చెట్టు కొమ్మ‌లు వీళ్ల స్థ‌లంలోకి వంగి ఉండేవి. ఆక‌లి న‌క‌న‌క‌లాడుతోంది. దానిమ్మ కాయ‌లైనా కోసుకు తిందామ‌ని చూశాడు. ఎక్క‌డా ఒక్క పెద్ద దానిమ్మ కాయ లేదు. అన్నీపిందెలే! వాటినే కోసుకొని తినేశాడు. ఇంకేముంది.. నోరంతా పొక్కిపోయి, పుండులా త‌యారైంది. అలాంటి ప‌రిస్థితుల నుంచి ఇవాళ జ‌బ‌ర్ద‌స్త్‌లో టాప్ కమెడియ‌న్ రేంజ్‌కు ఎదిగి, మంచి రెమ్యూన‌రేష‌న్ అందుకుంటున్నాడు. ఒక‌దాని త‌ర్వాత ఒక‌టిగా సినిమాలు కూడా చేస్తున్నాడు. ఈ విష‌యాల‌న్నీ ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చాడు శ్రీ‌ను.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.