English | Telugu

‘ఇప్పటివరకు ఒక లెక్క..ఇప్పటి నుండి మరో లెక్క..సూర్య ఈజ్ బ్యాక్ ఇన్ యాక్షన్’!


బిగ్ బాస్ హౌస్ స్టార్ట్ ఐన దగ్గర నుంచి ప్రారంభం నుండి టాస్కులు ఆడడంలో కానీ..మిమిక్రీ చేసి ఎంటర్టైన్ చేయడంలో కంటెస్టెంట్ ఆర్జే సూర్య వేరే లెవెల్. కానీ కొంతమంది వలన ఆయన ఇటీవల ఎలిమినేట్ ఐపోయాడు. హౌస్ లోకి వెళ్లిన దగ్గర నుంచి తనకి తాను ఫెమినిస్ట్ అని చెప్పుకునే సూర్య ఆరోహితో తర్వాత ఆమె ఎలిమినేట్ ఐపోయాక ఇనాయతో క్లోజ్ గా ఉన్నాడు..

ఇక ఇద్దరి మధ్య ముద్దులు, హగ్గులతో చిన్న సైజు రొమాంటిక్ షోని చూపించేసరికి ఆడియన్స్ ఆయన్ని ఎలిమినేట్ చేసి పారేశారు..అలాంటి సూర్య ఇప్పుడు తనని ఇష్టపడే వారి కోసం ఒక గుడ్ న్యూస్ చెప్పేసాడు. ఇప్పుడు ఆ గుడ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆర్జే సూర్య వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి రీ-ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది..ఈ విషయం గురించి ఆయన తన ఇన్స్టాగ్రామ్ లో పెట్టింగ్ పోస్ట్ ద్వారా అర్థమైపోతుంది.

ఇక ఇప్పుడు పోస్ట్ చేసిన ఫోటో చూస్తే ఆ వార్తలు నిజమే అని తెలుస్తోంది. అలాగే ‘ఇప్పటి వరకు ఒక లెక్క..ఇప్పటి నుండి మరో లెక్క..సూర్య ఈజ్ బ్యాక్ ఇన్ యాక్షన్’ అని ఒక టాగ్ లైన్ పెట్టాడు ..ఆ పోస్ట్ లో బిగ్ బాస్ హాష్ టాగ్ కూడా వాడేసరికి సూర్య మళ్ళీ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టబోతున్నట్టుగా తెలుస్తోంది. మరి అది నిజమో కాదో తెలియాలంటే ఈ వీకెండ్ వరకు వెయిట్ చెయ్యాల్సిందే.. ఇక సూర్య నిజంగానే రీఎంట్రీ ఇస్తున్నాడా లేదా ఏదైనా మూవీకి సంబందించిన స్టిల్లా అనేది ఇంకా తెలీదు. ఐతే నెటిజన్స్ మాత్రం రీఎంట్రీ ఇస్తున్నావా ? అని కామెంట్స్ పెడుతున్నారు. ఇకపోతే ఒకవేళ సూర్య రీఎంట్రీ ఇస్తే గనక ఆ తర్వాత గీతూని కూడా వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్లోకి తీసుకురావొచ్చేమో అభిమానుల కోరిక మేరకు. ఎందుకంటే కొంత మంది కంటెస్టెంట్స్ హౌస్ లో ఉన్నప్పుడు వచ్చిన రేటింగ్ వాళ్ళు ఎలిమినేట్ అయ్యి బయటికి వచ్చాక ఆ షోకి అంత రేటింగ్ రావడం లేదు. సో. మరి బిగ్ బాస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.