English | Telugu
చేపల వేట.. కంటెస్టెంట్స్ మధ్య గలాట!
Updated : Oct 26, 2022
బిగ్ బాస్ లో యాభై ఒకటో రోజు 'శ్రీమంతుడు' మూవీలోని 'రామ రామ ' పాటతో మొదలైంది. ఆ తర్వాత టాస్క్ నియమాలు కంటెస్టెంట్స్ కి వివరించాడు బిగ్ బాస్.కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ లో భాగంగా చేపల వర్షం కురిసింది. ఆ టాస్క్ ముగిసే సమయానికు రేవంత్-ఇనయాదగ్గర ఎక్కువ చేపలు ఉన్నాయి.
"ఆ తర్వాత గేమ్ 'పూల్ లో గోల్డ్ కాయిన్'. పూల్ లో బాల్స్ తో పాటుగా అందులో గోల్డ్ కాయిన్ ఉంది. అది ఎవరికి లభిస్తే వాళ్ళు విజేత" అని బిగ్ బాస్ చెప్పాడు కంటెస్టెంట్స్ తో. ఆ తర్వాత రేవంత్ కి గోల్డ్ కాయిన్ దొరికింది. ఇది దొరకడం వల్ల రేవంత్ కి తర్వాత గేమ్ కి సభ్యులను ఎన్నుకునే అవకాశం దొరికింది. ఆ తర్వాత గేమ్ కి రేవంత్, ఇనయా కలిసి రెండు టీంలుగా విభజించుకున్నారు. ఆ టీంలలో గీతు, ఆదిరెడ్డి అవుట్ అయ్యారు. కాగా సూర్యని సంచాలకుడిగా నియమించారు.
ఆ తర్వాత టాస్క్ పేరు 'పుల్ ద కాట్". ఈ టాస్క్ లో ఆదిత్య, రేవంత్ ఒక వైపు నుండి కాట్ ని పుష్ చేస్తుండగా, మరో వైపు నుండి శ్రీహాన్, రాజ్ పుష్ చేసారు. కాగా ఆ కాట్ మీద శ్రీసత్య, ఫైమా, ఇనయా, కీర్తి కూర్చున్నారు. ఇందులో శ్రీహాన్-రాజ్ టీం గెలిచింది. గేమ్ ముగిసాక సంచాలకుడితో రేవంత్ మట్లాడుతుండగా, రాజ్ కూడా అదే సమయంలో మాట్లాడటంతో రేవంత్ కి కోపం వచ్చింది.
ఆ తర్వాత "రాజ్ నేను నీతో మాట్లాడట్లేదు. నన్ను రెచ్చగొట్టకు" అని రేవంత్ అనగా, దానికి సమాధానంగా "నేను నీతో మాట్లాడట్లేదు. సంచాలకుడితో మాట్లాడుతున్నా" అని రాజ్ చెప్పాడు.ఆ తర్వాత ఇనయా "సంచాలకుడిగా సూర్యని అనవసరంగా ఎన్నుకున్నాం. అసలు కరెక్ట్ గా చూడలేదు. చూడకుండా వాళ్లకు సపోర్ట్ చేసాడు" అని రేవంత్ కి చెప్పింది.
చేపల కోసం కంటెస్టెంట్స్ మధ్య జరిగిన గలాటాలో గీతు పర్ఫామెన్స్ తక్కువ అనే చెప్పేయొచ్చు. అయితే రేవంత్ తన ఆల్ రౌండర్ పర్ఫామెన్స్ తో మెప్పించాడు. ఈ వారం కంటెస్టెంట్స్ అందరు నామినేషన్లో ఉండగా ఎవరు బయటకొచ్చేస్తారు అనేది చాలా ఆసక్తిని రేకెత్తిస్తోంది.