English | Telugu

తేనెపూసిన కత్తిని గొంతులో దింపారు... దిస్ ఈజ్ 2.0

బిగ్ బాస్ హౌజ్ లో కథ మళ్ళీ కొత్తగా మారింది. నిన్నంతా నామినేషన్ల ప్రక్రియ కొనసాగింది. ‌అందులో కొత్త హౌజ్ మేట్స్, పాత హౌజ్ మేట్స్ మధ్య చిచ్చు పెట్టాడు బిగ్ బాస్. ఈ నామినేషన్ ని సీక్రెట్ రూమ్ లో ఉండి చూసిన ఉన్న గౌతమ్ కృష్ణ.. తనలో తనే రగిలిపోయాడు.

గౌతమ్ కృష్ణ సీక్రెట్ రూమ్ లో ఉన్నాడేమోనని టేస్టీ తేజ మొన్నటి ఎపిసోడ్ లో గుర్తుచేశాడు. ఇక నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యాక గౌతమ్ కృష్ణని హౌజ్ లోకి పంపించాడు బిగ్ బాస్. అయితే గౌతమ్ కృష్ణ హౌజ్ లోకి వచ్చి రాగానే పిచ్చి పట్టినట్టుగా ఏవో ఏవో డైలాగ్స్ చెప్పుకుంటూ వచ్చాడు‌. రాననుకున్నారా? రాలేననుకున్నారా.. అశ్వత్థామ ఈజ్ బ్యాక్. తేనెపూసిన కత్తిని గొంతులో దింపారు కదా అయిన ఈ అశ్వత్థామ చావడు. ఎట్లెల్లిన్నో అట్లే వచ్చినా.. దిస్ ఈజ్ 2.0 అంటు అరుస్తున్నాడు గౌతమ్ కృష్ణ. అది చూసి హౌజ్ లోని వారంతా ఏంటి ఈ ఓవరాక్షన్ అన్నట్టు మొహాలు పెట్టారు. ఇక కొత్తగా రిలీజైన ప్రోమో కింద గౌతమ్ కృష్ణని తిడుతూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

గౌతమ్ కృష్ణది ఓవారాక్షన్ అంటూ ఒకరు, అసలు అనవసరంగా లోపలికి రానిచ్చారంటు ట్రోల్స్ చేస్తున్నారు. ఇక గౌతమ్ కి నామినేషన్ చేసే అవకాశాన్ని కల్పించాడు బిగ్ బాస్. పాత హౌజ్ మేట్స్ లో నామినేషన్లో ఉన్న ఒకరిని సేవ్ చేయొచ్చు, కొత్త హౌజ్ మేట్స్ లోని ఒకరిని నామినేట్ చేయాలని బిగ్ బాస్ చెప్పగా.. కొత్త వాళ్ళని నామినేట్ చేయకుండా పాతవాళ్ళలో ఒకరైన ఆట సందీప్ ని నామినేషన్ నుండి తప్పించినట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటికే ప్రతీ వారం సంఛాలక్ గా ఫెయిల్ అవుతున్న ఆట సందీప్ ని సేవ్ చేయడంతో బిగ్ బాస్ అనవసరంగా లోపలికి రానిచ్చాడని అనుకుంటున్నారు ప్రేక్షకులు.

శివాజీ చెప్పినట్టుగా‌నే గౌతమ్ కృష్ణ వల్ల.. ఫెయిర్ గేమ్ ఆడేవాళ్ళు నామినేషన్లో ఉంటున్నారు. అన్ ఫెయర్ గా ఆడుతు‌న్న అమర్ దీప్, ఆట సందీప్ లాంటివాళ్ళు సేవ్ అవుతున్నారు. మరి గౌతమ్ చేసిన ఈ పనికి ఇప్పటికే ఇతనిపై అశ్వత్థామ కాదు తుస్ వద్దామ అంటూ ట్రోల్స్ మొదలెట్టారు నెటిజన్లు.