English | Telugu

నాకన్నా డిజర్వింగ్ కానివాళ్ళున్నారు.. శోభాశెట్టి ఓవరాక్షన్!

బిగ్ బాస్ సీజన్-7 రోజ రోజుకి ఉత్కంఠభరితంగా మారుతుంది. ఒకవైపు స్పై బ్యాచ్ మరోవైపు స్పా బ్యాచ్ మధ్యలో ఒకే ఒక్కడు అర్జున్ మిగిలిపోయాడు. బిగ్ బాస్ కి ఎంత క్రేజ్ పెరిగిందంటే.. రాత్రి 9 గంటలు అయిందంటే చాలు అందరూ టీవీల ముందు వాలిపోయేంతలా ఉంది. ఎప్పుడూ వచ్చే సీజన్ల కంటే కూడా ఈ సీజన్ మరింత రసవత్తరంగా సాగుతోంది.

మొదటి వారం పద్నాలుగు మంది కంటెస్టెంట్లు హౌస్ లోకి అడుగు పెట్టారు. నాలుగు వారాల పాటు నలుగురిని ఎలిమినేట్ చేశారు. ఆ తర్వాత గౌతమ్ ఎలిమినేట్ అవుతున్నట్లుగా చెప్పి అతడిని సీక్రెట్ రూమ్ కు పంపించారు బిగ్ బాస్. ఆ తర్వాత ఒక్కరోజులోనే తిరిగి ఇంట్లోకి రప్పించారు. అసలు అతడిని ఎందుకు పంపారో, ఎందుకు తెచ్చారో ఎవరికీ అర్థం కాలేదు. ఇదిలా ఉండగా... ఐదో వారం గ్రాంఢ్ లాంఛ్ 2.0 లో భాగంగా ఐదుగురు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లను హౌస్ లోకి తీసుకొచ్చారు.

అది చాలదు అన్నట్లు గత వారాల్లో నామినేట్ అయిన రతిక రోజ్, శుభశ్రీ రాయగురు, సింగర్ దామినిలను స్టేజీపైకి తీసుకొచ్చి.. హౌస్ లోకి రీఎంట్రీకి ఓటింగ్ పెట్టారు. అందులో ఎక్కువ ఓట్లు వచ్చిన కంటెస్టెంట్ ని కాకుండా.. అతి తక్కువ ఓట్లు వచ్చిన రతిక రోజ్ ను ఎవరు ఊహించని విధంగా ఇంట్లోకి పంపి ఉల్టా పుల్టా ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్.

ఇలా ఎవరూ ఊహించని విధంగా ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు ఇస్తు షోను మరింత రసవత్తరంగా మలుస్తున్నారు. అలాగే అదిరిపోయే టాస్క్ లు ఇస్తూ ఫుల్లుగా కంటెస్టెంట్లతో ఆడుకుంటున్నారు. కేవలం వీకెండ్స్, నామినేషన్స్ టాస్క్ లను మాత్రమే చూసే బుల్లితెర ప్రేక్షకులు.. ప్రతిరోజు ఎపిసోడ్ చూసేలా చేస్తున్నారు. ఇప్పటికే పదమూడు వారాలు సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకున్న ఈ షో.. పద్నాలుగవ వారంలోకి అడుగు పెట్టింది. ముఖ్యంగా పదమూడవ వారం ఎవరు ఊహించని విధంగా గౌతమ్ కృష్ణ ఎలిమినేట్ అయ్యాడు. ఆ తర్వాత శోభాశెట్టి ఓవారాక్షన్ చేసింది. ఎస్.. నేను డెఫినెట్లీ ఉంటాను. ఎందుకంటే నా కన్న హౌస్ లో డిజర్వింగ్ కానీ వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను కచ్చితంగా చివరి వరకు ఉంటానని శోభాశెట్టి అంది. ఇదిచూసిన అభిమానులు మాత్రం తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. గత ఆరువారాల ఓటింగ్ రిజల్ట్స్ ఆ దత్తపుత్రికకు ఒకసారి చూపించడయ్యా.. ఈ ఓవారక్షన్ తట్టుకోలేకపోతున్నాం. శోభాశెట్టి కోసం ఇంకా ఎంతమంది అమాయకులని బలి చేస్తారంటు ప్రతీ బిగ్ బాస్ ప్రోమో కింద కామెంట్లు చేస్తున్నారు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.