English | Telugu

Inaya Sultana :  ఇనయాతో గౌతమ్ పెళ్లి.. క్లారిటీ ఇచ్చేశాడుగా!


బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో ఇనయా ముజిబుర్ రహమాన్ గా ఎంట్రీ ఇచ్చి ఎంతో క్రేజ్ సంపాదించుకుంది. ఇనయా తన ఫ్యామిలీని వదిలి ఇండస్ట్రీకి వచ్చిందని చాలాసార్లు చెప్పింది. ఇక బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో రేవంత్, శ్రీహాన్ లతో పోటీపడి ఆడిన ఇనయా సుల్తానాకి బయట ఫ్యాన్ బేస్ పెరిగింది.

ఇక బయటకొచ్చాక గోవా టూర్లు, విదేశీ టూర్ల పేరుతో వ్లాగ్స్ చేస్తూ ఫుల్ వైరల్ గా నిలిస్తోంది. తరచూ అందాల ఆరబోత చేస్తూ కుర్రాళ్ళని తనవైపు తిప్పుకుంటుంది. తాజాగా జిమ్ ట్రైనర్ గౌతమ్ తో డేటింగ్ లో ఉన్న ఇనయా.. విచ్చలవిడిగా తిరిగేస్తూ నెట్టింట వైరల్ గా మారారు. అదే విషయం గురించి గౌతమ్ ని అడుగగా.. ఎంజాయ్ చేయడాలు.. బెడ్ రూమ్ ఫొటోలు సోషల్ మీడియాలో పెట్టడం వరకేనా? లేదంటే పెళ్లి గట్రాల్లాంటివి ఏమైనా ఉన్నాయా? అని అడిగితే.. ఆసక్తికరమైన సమాధానమిచ్చాడు గౌతమ్‌.. పెళ్ళా? అబ్బే.. మేం ఇద్దరం చిన్న పిల్లలం.. మా గోల్స్ అచీవ్ చేసిన తరువాత పెళ్లి చేసుకుంటే సంతృప్తిగా ఉంటుందని గౌతమ్ అన్నాడు. ‘నవంబర్‌లో మా ఎంగేజ్‌మెంట్, పెళ్లి అనే వార్తలు వస్తున్నాయి. నిజానికి నవంబర్ నాకు ఇష్టమైన నెల. అమ్మనాన్నలు కూడా నవంబర్‌లోనే పెళ్లి చేసుకున్నారు. అదే నెల అంటే నాకూ ఇష్టమే కానీ.. కెరియర్‌పై ఫోకస్ పెట్టాం. ఇనయ గురించి మా ఇంట్లో వాళ్లకి కూడా తెలుసు. మా అమ్మ చాలా మోడ్రన్. చాలా చిల్.. ఒప్పుకోదు అనడానికి ఏం లేదు. మమ్మల్ని మా అమ్మ బాగా ఎంకరేజ్ చేస్తుంటారు. ఇనయ స్మైల్ గురించి తెలిసిందే కదా.. అలా మా అమ్మ కూడా పడిపోయారని గౌతమ్ చెప్పాడు.

ఇన్‌స్టాగ్రామ్‌లో మా పోస్ట్‌లు చూసి చాలామంది చాలా రకాలుగా కామెంట్‌లు పెడుతున్నారు. వీళ్లు ఎంతకాలం కలిసి ఉంటారులే అని. వాటిని నేను కేర్ చేయను. మహా అయితే కొంతసేపు బాధపడతాం కానీ.. దాన్ని పట్టించుకోవడం లేదు. వాళ్లు బ్యాడ్ కామెంట్స్ పెట్టినప్పుడు కాసేపు బాధపడతాం.. ఆ ఫొటోలు బాగున్నాయి కదా.. లవ్ కామెంట్స్ పెట్టొచ్చు కదా.. లైక్ కొట్టొచ్చు కదా అని అనుకుంటాను. మా ఇద్దర్నీ చూసి మురిసిపోతున్నారని అనుకుంటా తప్పితే పెద్దగా పట్టించుకోను. మనకి నచ్చిన పని మనం చేసుకుంటూ వెళ్లిపోవడమే. ఎవరికి తలవంచాల్సిన పనిలేదు. ఆరోగ్యం జాగ్రత్తగా ఉంచుకోండని చెప్తుంటానని గౌతమ్ చెప్పుకొచ్చాడు.