English | Telugu
నాన్న లేని లోటు ఎవరూ తీర్చలేనిది
Updated : Jun 16, 2022
శ్రీదేవి డ్రామా కంపెనీ ఎప్పుడూ కొత్త స్కిట్స్ తో ఆడియన్స్ ఎంటర్టైన్ చేస్తున్న ఒక మంచి వేదిక. ఐతే ఇప్పుడు ఫాదర్స్ డే రాబోతోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని శ్రీదేవి డ్రామా కంపెనీ నాన్న నా హీరో అనే పేరుతో వచ్చే వారం ఒక మంచి కార్యక్రమాన్ని ప్రసారం చేయబోతోంది. దీనికి సంబంధించిన ప్రోమో ఒకటి ఇప్పుడు రిలీజ్ అయ్యింది. ఇందులో ఫాదర్స్ v / s సన్స్ స్కిట్స్ మంచి రసవత్తరంగా , పంచ్ డైలాగ్స్ తో నిండిపోయింది. బులెట్ భాస్కర్ వాళ్ళ నాన్న, నూకరాజు వాళ్ళ నాన్న, గలాటా గీతూ వాళ్ళ నాన్న, ఆడపిల్లన్నమ్మ అనే పాటతో సెన్సేషన్ సృష్టించిన మాధప్రియ వాళ్ళ నాన్న ఇలా చాలామంది ఆర్టిస్ట్స్ వాళ్ళ ఫాదర్స్ తో వచ్చి స్టేజి మీద పెర్ఫార్మ్ చేశారు. అలాగే ఒకరికి ఒకరు సేమ్యా తినిపించుకుని విషెస్ చెప్పుకున్నారు.
గుడ్ పేరెంట్స్, బాడ్ పేరెంట్స్ ఉంటారో లేదు తెలీదు, కానీ నేను నాన్న దగ్గర నుంచి ఎలాంటి ఎఫెక్షన్ ని చూడలేదు అంటూ యాంకర్ రష్మీ కంటి తడి పెట్టేసరికి అక్కడున్న అందరి కళ్ళు చెమ్మగిల్లాయి. మిగతా ఆర్టిస్ట్స్ వాళ్ళ జీవితాల్లో వాళ్ళ నాన్నల పాత్ర గురించి చెప్పుకుని కాసేపు బాధపడ్డారు. నాటీ నరేష్ గుమ్మాడి గుమ్మాడి అంటూ డాడీలో సాంగ్ పాడి అందరికి బోర్ కొట్టించి మరీ ఎంటర్టైన్ చేసాడు. శ్రీవాణి హస్బెండ్ విక్రమ్ చేసిన స్కిట్ తో పూర్ణ చాలా ఎమోషన్ అయ్యింది. ఇక ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.