English | Telugu
జానీ మాస్టర్ కి కోపం తెప్పించిందెవరు?
Updated : Jun 17, 2022
ఢీ డ్యాన్సింగ్ షో.. అటు అదరగొట్టే డ్యాన్సులతో, ఆది-ప్రదీప్ కామెడీతో, అందమైన జడ్జెస్ నవ్వులతో దూసుకుపోతోంది. ఈ షో ఇప్పుడు ఎంతో సక్సెస్ఫుల్ గా నడుస్తోంది. ఇటీవల ఈ షో లేటెస్ట్ ప్రోమోని నిర్వాహకులు రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలో జానీ మాస్టర్ చాలా సీరియస్ గా సీట్ లోంచి లేచి వెళ్లిపోవడం చూపించారు. ఇక ఈ ప్రోమోలో ఒక రష్యన్ భామతో ఆది చేసిన కామెడీ బాగా నవ్వు తెప్పిస్తుంది. 'పుష్ప' మూవీ నుంచి "ఊ అంటావా" సాంగ్ కి రష్యన్ బ్యూటీ చేసిన డాన్స్ అద్దిరిపోయింది.
"వందేమాతరం...మనదే ఈ తరం" అనే సాంగ్ కి కొంతమంది డాన్సర్స్ అదరగొట్టేసారు. ఈ సాంగ్ కి జడ్జెస్ లేచి సెల్యూట్ చేశారు కూడా. అప్పటివరకు అంతా బానే నడిచింది.అంతలోనే జానీ మాస్టర్ సీరియస్ ఇపోయారు. "ఢీ షో చాలా పవర్ ఫుల్, సీరియస్ గానే చెబుతున్నా, పెర్ఫార్మెన్స్ ఏమీ బాలేదు, కొరియోగ్రఫీ కూడా బాగా లేదు. అసలు ఏం బాలేదు" అంటూ జడ్జి సీటులోంచి లేచి వెళ్లిపోయారు జానీ మాస్టర్. దాంతో అక్కడి వాతావరణం ఒక్కసారి వేడెక్కింది. ఇంతకు జానీ మాస్టర్ కోపానికి కారణం ఏమిటి? అనే విషయం తెలుసుకోవాలంటే ఈ వారం ఎపిసోడ్ కోసం కాస్త వెయిట్ చేయాల్సిందే.