English | Telugu
అగ్గిపెట్టెలో పట్టుచీర...పల్లవికి సిరిసిల్ల గిఫ్ట్
Updated : Aug 3, 2024
జీ తెలుగులో ప్రసారం కాబోయే అత్తా కోడళ్ల బోనాల జాతర ప్రోమో చాలా అందంగా ఉంది. ఈ ప్రోగ్రాంలో చాలా హైలైట్స్ ఉన్నాయి. అలాగే ఈ షోకి సిరిసిల్ల నుంచి కొంతమంది చేనేత మహిళా కార్మికులు వచ్చారు. వాళ్ళు ఈ షోకి స్పెషల్ గా రావడమే కాదు ఒక అద్భుతాన్ని కూడా చేసి తీసుకొచ్చారు. వాళ్లంతా పల్లవి ఫాన్స్. ఆమె కోసం సిరిసిల్ల నుంచి వాళ్ల ప్రేమను, అభిమానాన్ని మూటగట్టుకొచ్చారు. అది కూడా ఒక అగ్గిపెట్టెలో.
ఏంటి అనుకుంటున్నారా. అగ్గిపెట్టెలో ఇమిడిపోయే ఒక అద్భుతమైన పట్టు చీరను వాళ్ల స్వహస్తాలతో తయారు చేసి ఆ అగ్గిపెట్టెలో పెట్టి మరీ తీసుకొచ్చారు. దానికి పల్లవి ఫుల్ ఖుషీ ఐపోయింది. వాళ్ళను హగ్ చేసుకుంది పల్లవి. అంతే కాదు ఇంకో స్పెషల్ ఏమిటి అంటే ఆ చీర మీద పల్లవి చిత్రం కూడా కనిపిస్తుంది. ఇక తాను కట్టుకున్న పట్టుచీర చూపించి ఆ చీర తన నాన్న ఇచ్చారని చెప్తూ వీళ్లంతా ఇచ్చిన ఈ చీరను చూసి చాలా ఆనందంగా వాళ్లకు థ్యాంక్స్ కూడా చెప్పింది. ఆ చీర తనకెంతో ప్రత్యేకం అని కూడా చెప్పింది. 'పసుపు కుంకుమ' సీరియల్ హీరోయిన్ గా బుల్లితెర ప్రేక్షకులకు పల్లవి అంటే చాలా ఇష్టం. ఈ సీరియల్‌లో అంత బాగా నటించింది. ఆ తర్వాత 'సావిత్రి' సీరియల్‌తో వచ్చి తెలుగు ఆడియన్స్ గుండెల్లో నిలిచిపోయింది.