English | Telugu

అతనే నా బెస్ట్ బెస్ట్ బెస్టస్ట్ ఫ్రెండ్


బుల్లితెర మీద లాస్య మంజునాధ్ గురించి అలాగే యాంకర్స్ గా ఒకప్పుడు లాస్య-రవి చేసిన అల్లరి గురించి చెప్పక్కర్లేదు. అలాంటి లాస్యమంజునాధ్ కి ఇద్దరు మగపిల్లలు. ఇక ఆమె రెండు కొడుకు మున్నుకు అక్షరాభ్యాసం వేడుకను చేసింది. జీ తెలుగు వారి ఆధ్వర్యంలో బోనాల జాతర ఈవెంట్ లో ఈ అక్షరాభ్యాసం వేడుకను నిర్వహించారు. ఈ వేడుకకు బుల్లితెర నటీనటులంతా వచ్చారు. అలాగే ఒకప్పటి లాస్య బెస్ట్ ఫ్రెండ్ రవి వచ్చాడు. ఇక మంజునాథ్ అక్షరాభ్యాసం చేయించాక యాంకర్ రవి వచ్చి మా మున్ను గాడికి అంటూ ఒక వెండి లాకెట్ తో ఉన్న ఒక చెయిన్ ని మెడలో వేసి గిఫ్ట్ గా ఇచ్చాడు. ఇక లాస్య ఫుల్ ఎగ్జాయిట్ అయ్యింది.

రవి థ్యాంక్యూ సో మచ్ అని చెప్పింది చాలా హార్ట్ ఫుల్ గా. రవి ఐతే లాస్య చూపించిన అభిమానానికి కన్నీళ్లు పెట్టుకుని మరీ తుడుచుకున్నాడు. ఇక లాస్య కోసం ఫ్రెండ్ షిప్ బ్యాండ్ తెచ్చానని అని చూపించాడు. "నువ్వేమన్న తెచ్చినవా నా కోసం" అని రిటర్న్ గిఫ్ట్ అడిగాడు రవి. దానికి లాస్య అరచేయి చూపించి తన చేతిలో ఉన్న ఫ్రెండ్ షిప్ బ్యాండ్ కి కూడా చూపించింది. రెండు బ్యాండ్స్ ఒకేలా ఉండడంతో "ఓ ఒక షాప్ లో కొన్నామా ఇద్దరం" అన్నాడు. దానికి లాస్య నవ్వేసింది. తర్వాత ఇద్దరూ ఫ్రెండ్ షిప్ బ్యాండ్స్ కట్టుకున్నారు "అతను నా బెస్ట్ బెస్ట్ బెస్టస్ట్ ఫ్రెండ్ " అని బలంగా చెప్పింది లాస్య. ఒకప్పుడు బుల్లితెర మీద ప్రసారమైన సంథింగ్ స్పెషల్ అనే ప్రోగ్రాంతో ఈ ఇద్దరి ప్రయాణం మొదలైంది. ఆ స్నేహం ఇప్పటివరకు కంటిన్యూ అవుతూనే ఉంది.

Jayam serial : పారు వేసిన ప్లాన్.. గంగని అపార్థం చేసుకున్న రుద్ర!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -140 లో..... పెళ్లి అయి మొదటిసారి ఇంటికి వచ్చిన అల్లుడు కూతురికి లక్ష్మి మర్యాదలు చేస్తుంది. రుద్రకి వరుస అయ్యోవాళ్ళు ఒక ఆటాడుకుంటారు. నల్లపూసల కార్యక్రమం అయ్యాక శోభనానికి ఏర్పాట్లు చేస్తారు. ఇద్దరికి బంతాట ఆడిపిస్తారు. బిందెలో రింగ్ తీయిస్తారు. ఇద్దరు సరదాగా ఉంటారు. రుద్ర వంక గంగ చూస్తుంటే.. ఏంటి చూస్తున్నావ్ వెళ్లి కింద పడుకోమని రుద్ర అంటాడు. ఆ తర్వాత రుద్ర, గంగ సరదాగా బాక్సింగ్ చేస్తుంటారు. అప్పుడే రుద్ర కాలికి సెల్ఫీ స్టిక్ తగులుతుంది. అది రౌడీ చేత పారు పెట్టిస్తుంది.