English | Telugu

నా కోసం కూడా ఒకళ్ళు కామెంట్ పెడుతున్నారని హ్యాపీగా ఫీలవుతా

ఫ్యామిలీ స్టార్స్ ఎపిసోడ్ ఈ ఆదివారం ఆడియన్స్ ని ఫుల్ ఎంటర్టైన్ చేసింది. ఇందులో చీకటి కోణం అనే ఒక కాన్సెప్ట్ ని పవిత్ర రన్ చేసింది. ఇందులో వర్షని ఇంటర్వ్యూ చేసింది పవిత్ర. "వర్ష ఇండస్ట్రీలో బాగా సెట్ ఐపోయింది. ఐతే ఒక లవ్ ట్రాక్ వల్లే సెటిల్ ఐనట్టు నాకనిపిస్తోంది తన జీవితం కూడా సెట్ ఐనట్టు అనిపిస్తోంది దీనికి ఏమంటావ్" అని పవిత్ర వర్షని అడిగింది. "మీకు అనిపిస్తే అది మీ ఒపీనియన్ . నేను దాన్ని మార్చలేను, లవ్ ట్రాక్ వల్లే నేను సెట్ అయ్యాను, లవ్ ట్రాక్ వల్లే నేను ఉన్నాను అనేది కాదు కానీ లవ్ ట్రాక్ వెళ్ళిపోయి చాలా రోజులు అయ్యింది. అప్పుడే నేను కూడా వెళ్లిపోవాల్సింది కదా కానీ ఇంకా ఇక్కడైకి గెస్ట్ లా వచ్చి ఉన్నాను అంటే అర్ధం చేసుకోవాలి" అని చెప్పింది వర్ష.

"యాక్టింగ్ రాకపోవడం వల్లే గ్లామర్ మీద మొత్తం తన ఫోకస్ మీదే ఉంది అనేది బయట నెటిజన్స్ అనుకుంటున్నారు" అని పవిత్ర అడిగింది. "నేను చాలా హ్యాపీగా ఉన్నాను. గ్లామర్ అన్నందుకు. " అంది వర్ష. "మీకు ఎవరైనా బాడ్ కామెంట్స్ పెడితే ఎలా రియాక్ట్ అవుతారు" అని అడిగింది. "ఎలాంటి కామెంట్ పెట్టినా నా కోసం ఒకళ్ళు కామెంట్ పెట్టారు అంటూ హ్యాపీగా ఫీలవుతాను." అని చెప్పింది. వర్ష బుల్లితెర మీద ఆన్ స్క్రీన్ జోడీగా ఇమ్మానుయేల్ తో కలిసి స్టార్టింగ్ లో బాగా ఎంటర్టైన్ చేసింది.

ఐతే వీళ్ళ జోడి బాగా హిట్ అయ్యాక నెమ్మదిగా ఇద్దరూ వేరే వేరే ఛానెల్స్ లో అవకాశాలను వెతుక్కుంటూ ఈ జోడి కాస్తా విడిపోయారు. ఇమ్మానుయేల్ ఇప్పుడు స్టార్ మాకి వచ్చాడు. వచ్చిన కొద్దీ రోజులకే బిగ్ బాస్ కి వెళ్ళాడు. ఇక వర్ష ఐతే వేరే ఛానెల్ లో ఇంటర్వ్యూస్ చేస్తూ తన దారిలో తానూ వెళ్తోంది.