English | Telugu

స్పెల్లింగ్ అంత లేవు..రూమ్ లో ఏసీ వేసుకుని వణుకుతూ ఛిల్ల్ అవుతారు..నీకెందుకు ?

ఫ్యామిలీ స్టార్స్ షోలో ఈ వారం పాగల్ పవిత్ర కొంతమందిని రకరకాల ప్రశ్నలు అడిగి కామెడీ రోస్ట్ చేసింది. ఇక నటి హేమని పిలిచింది. ఆమె విషయంలో కాంట్రోవర్సి అనే పదాన్ని సరిగా పలకకపోయేసరికి నటుడు సమీర్ ఒక రేంజ్ లో ఆదుకున్నాడు. ఆ స్పెల్లింగ్ అంత లేవు నీకెందుకు అలాంటి పదాలు అంటూ పవిత్ర పరువు తీసేసాడు. ఇక పవిత్ర హేమని కొన్ని ప్రశ్నలు అడిగింది. "మీకు సినిమాల్లో గ్యాప్ వచ్చిందా మీరే తీసుకున్నారా.. దానికి రీజన్ ఏంటి" అని పవిత్ర హేమని అడిగింది.

"ప్రస్తుతానికి ఐతే నేనే గ్యాప్ తీసుకున్నాను. ఛిల్ల్ అవుదామని" అని హేమ చెప్పింది. "ఎలా ఛిల్ల్ అవుతారు అని పవిత్ర అడిగేసరికి అదేం ప్రశ్న రూమ్ లో ఏసీ వేసుకుని వణుకుతారు" అంటూ సుధీర్ కౌంటర్ ఇచ్చాడు. "హేమ వున్న చోట కాంట్రావర్సీ అవుతుందా ..హేమ ఉండడం వల్లే కాంట్రావర్సీ అవుతుందా అర్ధం కావట్లేదు" అని అంది. "చాల మంది బతకడం కోసం కాంట్రోవర్సి చేస్తూ ఉంటారు. నా వల్ల వాళ్ళు బతుకుతున్నారు కదా అని నేను హ్యాపీగా ఫీలవ్వుతుంటాను" అని చెప్పింది హేమ. "మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి" అని అడిగింది పవిత్ర. "ఛిల్ల్ అవుతారు మళ్ళీ" అంటూ సుధీర్ ఆన్సర్ చెప్పాడు. దానికి హేమ నవ్వేసింది.