English | Telugu
రిస్క్ అని తెలిసినా డెలివరీ చేసిన వేద!
Updated : Jun 15, 2022
బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్ `ఎన్నెన్నో జన్మల బంధం`. తల్లిదండ్రుల ఆదరణ కరువైన ఓ పాప.. పిల్లలే కలగరన్న కారణంతో పెళ్లికి దూరమైన ఓ డాక్టర్ మధ్య చిగురించిన అనుబంధం నేపథ్యంలో ఈ సీరియల్ ని రూపొందించారు. గత కొన్ని వారాలుగా విజయవంతంగా సాగుతూ మహిళా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. కీలక పాత్రల్లో నిరంజన్ బీఎస్, డెబ్జాని మోడక్, మిన్ను నైనిక నటించగా ఇతర పాత్రల్లో బెంగళూరు పద్మ, జీడిగుంట శ్రీధర్, ప్రణయ్ హనుమండ్ల, ఆనంద్, సుమిత్ర తదితరులు నటించారు.
యష్ ఆఫీస్ కి వెళుతూ వేదని ఫైల్ తెచ్చిపెట్టమంటాడు.. ఇదే సమయంలో వేద నెయిల్ పాలిష్ పెట్టుకుంటూ వుంటుంది. "ఖాళీగా లేను మీరే వెళ్లి తెచ్చుకోండి" అంటుంది. దీంతో యష్ సీరియస్ గా చూస్తాడు.. అతని చూపులు గమనించిన వేద.. "ఎందుకు లెండి అనవరంగా బీపీలు తెచ్చుకోవడం".. అంటూ లేస్తుంటే.. "వద్దులే నువ్వు నెయిల్ పాలిష్ పెట్టుకో.. అవసరమైతే మూతికి కూడా రాసుకో" అంటూ చిర్రుబుర్రులాడుతూ ఆఫీస్ కి వెళ్లిపోతాడు.
కట్ చేస్తే.. ఆ ఏరియా ఎమ్మెల్యేని ఎవరో హత్య చేశారని అతని అనుచరులు ఇటు వాళ్లు అటు వెళ్లకుండా.. అటు వాళ్లు ఇటు రాకుండా రాస్తారోకో చేస్తారు. ఎవరు వెళ్లాలని చూసినా దాడులకు దిగుతుంటారు. ఈ విషయం టీవీలో చూసిన వేద ... యష్ గురించి కంగారుపడుతుంది. వెంటనే ఫోన్ చేస్తుంది. యష్ అటెంట్ చేయడు. దీంతో యష్ తల్లి మాలిని ఫోన్ చేసి విషయం చెప్పడంతో "నేను క్షేమంగానే ఆఫీస్ కి చేరుకున్నాను" అంటాడు యష్. ఇంతలో కాలనీలో వుండే ఓ యువతికి పురిటి నొప్పులు మొదలవుతాయి. ఆమె తల్లి వేదని సహాయం చేయమంటుంది.
కాలనీ సమీపంలో గొడవలు జరుగుతున్నా తనని కాపాడాలని వేద హాస్పిటల్ కు తన కారులో తీసుకెళుతుంటుంది. అయితే మధ్య లో రోడ్ బ్లాక్ చేసిన ఎమ్మెల్యే అనుచరులు వేదని ముందుకు వెళ్లనీయకుండా అడ్డుకుంటారు. దీంతో చేసేది లేక తిరిగి మళ్లీ కాలనీకే వచ్చేస్తుంది. తనని డెలివరీ చేయమంటున్నారని యష్ కి చెబితే అనవసరంగా రిస్క్ అని తరువాత ని లైసెన్స్ రద్దు చేస్తారని హెచ్చరిస్తాడు. అయినా తనకు తెలిసిన వారే కావడంతో గైనకాలజిస్ట్ ని సంప్రదిస్తుంది వేద. "నువ్వే డెలివరీ చేయోచ్చుకదా" అని తను సలహా యిస్తుంది. ఎలా చేయాలో కూడా చెబుతుంది. తను చెప్పినట్టే ఫాలో అయి వేద డెలివరీ చేసి తల్లీ, బిడ్డని రక్షిస్తుంది. ఆ తరువాత ఏం జరిగింది? అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.