English | Telugu

సముద్రంలో ఉంది ఉప్పు మా ఫ్రెండ్ షిప్ నిప్పు

జీ తెలుగు చేసే షోస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందులోనూ ప్రదీప్ హోస్ట్ గా చేసే కార్యక్రమం అంటే చాలు నవ్వులు పువ్వులైపోతాయి. ప్రదీప్ హోస్ట్‌గా చేసిన సూపర్ క్వీన్ సీజన్ 1 మంచి హిట్ అయ్యింది. ఇప్పుడు సీజన్ 2 కూడా అదే రేంజ్ లో నవ్విస్తోంది. దీనికి సంబందించిన నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ ప్రోమో దోస్తీ స్పెషల్ థీమ్ తో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. సుహాసిని తన ఫ్రెండ్ అంబటి అర్జున్ తో కలిసి వచ్చింది. "సముద్రంలో ఉంది ఉప్పు, మా ఫ్రెండ్ షిప్ నిప్పు" అనేసరికి "మీ ఉప్పులో ఫ్రెండ్ షిప్ కి ఒక నమస్కారం" అన్నాడు. రోహిణి-పవిత్ర ఇద్దరూ ఫ్రెండ్స్ గా వచ్చారు. "పవిత్ర గురించి చెప్పాలంటే నాకు జీ తెలుగు సీరియల్ లోనే పరిచయం.." అని ఆలోచిస్తూ ఏం చెప్పాలో గుర్తురావట్లేదు అని పరువు తీసేసింది రోహిణి. సుష్మిత అనలా తన ఫ్రెండ్ జెస్సితో కలిసి వచ్చింది.

"ఆకాశమంత తెలుపు అని సుష్మిత అంటే..మా ఫ్రెండ్ షిప్ ఎరుపు" అంటూ చెత్త డైలాగ్ వేసి ఎంటర్టైన్ చేసాడు జెస్సి. కంటెస్టెంట్స్ ముందు బిర్యానీ ప్లేట్స్ పెట్టాడు...పవిత్ర, రోహిణి ఇద్దరూ ఒకరికొకరు తినిపించుకుని మరీ పోటీ పడ్డారు. ఐతే ప్లేట్ లో ఇంకా బిర్యాని ఉండిపోయేసరికి రోహిణి లేచి పొట్టను కాస్త కదిలించింది "బస్తా నిండిపోతే ఏం చేస్తాం అటు ఇటు ఊపుతాం కదా" అనేసరికి "అది బస్తా ఐతే ఓకే కానీ అదే లారీ నిండిపోతే" అంటూ ప్రదీప్ రోహిణి మీద సెటైర్ వేసాడు. ఈ షోకి శివబాలాజీ కూడా ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఈ షోలో కండక్టర్ ఝాన్సీ, జెస్సి, ఎస్తేర్, లిఖిత, సుష్మిత అనలా, నటి విద్యురామన్, మౌనిక యాదవ్ కనిపించారు. ఇలా ఈ వారం సూపర్ క్వీన్ దోస్తీ స్పెషల్ తో అలరించడానికి రాబోతోంది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.