English | Telugu

Brahmamudi: విషం కలిపిన పసరు మందుని తాగిన కావ్య.. రుద్రాణి ప్లాన్ సక్సెస్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-919 లో... రాజ్ బావ నాకు కావాలని రేఖ అనగానే దానికి రాహుల్ ఒప్పుకొని కావ్య కడుపులో బిడ్డని లేకుండా చేయాలని చెప్తాడు. రేఖని ఆ ఇంటికి కోడలుగా చెయ్యాలని రాహుల్ ప్లాన్ చెయ్యగా.. చాలా థాంక్స్ అన్నయ్య అని రేఖ అంటుంది. మీరు ఇద్దరు ఒకే అంటే చేసేదేముంది నా కూతురు ఈ ఇంటికి కోడలు అవుతుంది.. అంతకంటే ఏముందని రుద్రాణి అంటుంది.

మరొకవైపు ఇద్దరు అక్కాచెల్లెలు అప్పు, కావ్య కడుపుతో కూర్చొలేక నిల్చొలేక ఇబ్బందిపడుతారు. దాంతో అప్పు, కావ్య ఇద్దరు తమ భర్తల దగ్గరికి వచ్చి మమ్మల్ని ఇలా రెస్ట్ తీసుకొమ్మంటే మాకు ఇబ్బందిగా ఉందని అంటారు.

ఇక రాత్రి రుద్రాణికి పసరు మందు వైద్యుడు ఫోన్ చేసి మీరు చెప్పిన మందు తీసుకొని వచ్చానని చెప్పగానే సరే ఉండు వస్తున్నానని రుద్రాణి వెళ్తుంది. అప్పుడే తనకి ప్రకాష్ ఎదురుపడుతాడు. దాంతో రుద్రాణి భయపడుతుంది. కానీ ప్రకాష్ నిద్రలో నడుస్తాడు అది చూసి రుద్రాణి రిలాక్స్ అవుతుంది. ఇక రుద్రాణి బయటకు వెళ్లి పసరు మందు తీసుకొని వస్తుంది.

మరుసటి రోజు ప్రకాష్, సుభాష్ ఆఫీస్ కి వెళ్ళడానికి త్వరగా టిఫిన్ చేస్తుంటారు. దాంతో రాజ్ వచ్చి ఎవరు ఈ రోజు ఎక్కడికి వెళ్ళడానికి వీలు లేదు కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయని చెప్తాడు.

మరొకవైపు రాజ్ గదిలోకి రుద్రాణి, రేఖ వెళ్లి పసరు మందు తను తాగే ఆయుర్వేద మందులో కలుపుతారు. ఈ దెబ్బతో కావ్య బిడ్డ ఉండదని రుద్రాణి, రేఖ అనుకుంటారు.

ఆ తర్వాత ఏదో ఎంటర్‌టైన్మెంట్ ప్రోగ్రామ్ అన్నావ్ రాజ్ ఎక్కడ అని ప్రకాష్ అనగానే.. రాజ్, కళ్యాణ్ కలిసి కొన్ని చీటీలు రాసి అందులో ఏది వస్తే అది చెయ్యాలని చెప్తారు.

తరువాయి భాగంలో కావ్యకి రాజ్ ఆయుర్వేద మందు ఇస్తాడు. అది కావ్య తాగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.