English | Telugu
ఫైమా రెమ్యూనరేషన్ రోజుకి అంతా!
Updated : Oct 13, 2022
బిగ్ బాస్ హౌస్ లో అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంటున్న కంటెస్టెంట్ ఫైమా అనడంలో అతిశయోక్తి లేదు. ఫైమా కామారెడ్డిలోని దోమలకొండలో జన్మించింది. తనది నిరుపేద కుటుంబం. కనీసం సొంత ఇల్లు కూడా లేకుండా, అద్దె ఇంట్లో ఉంటున్నారు. తండ్రి వాచ్ మెన్, తల్లి బీడీలు చేస్తూ ఉంటుంది. తనకి ముగ్గురు అక్కలు. వాళ్ళు కష్టపడి ఫైమాని చదివించారట. అయితే వాళ్ళు ఈమెని అబ్బాయిలాగే పెంచారట.
తను చదువుకునేటప్పుడు ఒకరోజు 'పటాస్' షో కి, స్టూడెంట్ స్పెషల్ లో భాగంగా వాళ్ళ కాలేజీ వాళ్ళు తీసుకొచ్చారు. ఆ షోలో తన చలాకీతనం, పంచెస్ అన్ని కూడా బాగా ఉండడంతో యాంకర్ రవి, తనని పటాస్ లో కామెడీ చెయ్యమని అడిగాడు. తర్వాత తను బాగా ఆలోచించి ఒప్పుకొంది. అప్పటి నుండి కామెడీ షోస్ లో పాల్గొంటూ సత్తా చాటుతోంది. ఆ తర్వాత కొన్ని రోజులకి 'పటాస్' అయిపోవడంతో 'జబర్దస్త్'లో చేసే అవకాశం వచ్చింది. అప్పటి నుండి ఆమెకు సక్సెస్ స్టార్ట్ అయింది. తన జీవితంలో ఎక్కువగా కష్టాలే ఉన్నాయ్ అంటుంది ఫైమా. తనకంటు సొంత ఇల్లు లేని ఈ పటాస్ పిల్ల, ఈ షో ద్వారా తన సొంత ఇంటి కలని నెరవేర్చుకోవాలని, బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టిందట.
హౌస్ లో మొదటి రోజు నుండి హుషారుగా ఉంటూ, తనకంటూ ఒక కామెడీ మార్క్ ని క్రియేట్ చేసుకొంది. మంచి కామెడీ టైమింగ్ తో హౌస్ లో రాకెట్ లా దూసుకుపోతూ, అటు హౌస్ మేట్స్ ని మెప్పిస్తూ, ఇటు నాగార్జునతో కూడా వాహ్ అనిపించుకుంటోంది. ప్రతి వారం నామినేషన్ లో లాజిక్ లు మాట్లాడుకుంటూ, ఎదుటి వ్యక్తిని నివ్వెరపోయేలా, తడబడేలా చేస్తోంది. ప్రతి వారం నాగార్జునతన ఆటతీరును మెచ్చుకుంటున్నాడు. ఇప్పుడు తను చాలామంది 'బిగ్ బాస్ షో' అభిమానులకి ఇష్టమైన కంటెస్టెంట్ అని అనడంలో సందేహమే లేదు.
అయితే తను బిగ్ బాస్ గ్రాండ్ లాంచ్ రోజు నాగార్జునతో మాట్లాడుతూ, "నేను నా స్నేహితులతో బిగ్ బాస్ గురించి చెప్తు ఉంటే, నువ్వు ఏంటే? బిగ్ బాస్ ఏంటే? నీ కలర్ ఏంటే? అని ఎగతాళి చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ నేను ఇప్పుడు బిగ్ బాస్ స్టేజ్ మీద ఉన్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది" అని చెప్పుకొచ్చింది.
అయితే ఫైమా రెమ్యునరేషన్ రోజుకి ఇరవై వేల వరకు తీసుకుంటుందని తెలుస్తోంది. కాగా హౌస్ లో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే తను, చివరి వరకు బాగా పర్ఫామెన్స్ చేసి, టైటిల్ విజేతగా నిలుస్తుందో, లేదో.. చూడాలి మరి.