English | Telugu

'నాకు వంట రాదా ? ఫుట్ బాల్ ఆడతా వెజిటబుల్స్ తో'

ఆహా ఓటిటి వేదికపై ఎన్నో షోస్ స్ట్రీమ్ అవుతూ ఆడియన్స్కి పిక్చర్ క్లారిటీని అందించడంతో పాటు ఫుల్ ఎంటర్టైన్ చేస్తోంది. ఇక ఇదే వేదికపై "చెఫ్ మంత్ర సీజన్ 2 " స్టార్ట్ అయ్యింది. హోస్ట్ గా మంచు లక్ష్మి ఈ షోని హ్యాండిల్ చేస్తోంది. "చెఫ్ మంత్ర సీజన్ 1 "ని శ్రీముఖి హోస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు సీజన్ 2 స్టార్ట్ అయ్యింది. దీనికి సంబంధించి నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ 3 ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ ఎపిసోడ్ లో కొణిదెల నిహారిక, కాల భైరవ గెస్టులుగా వచ్చేసారు.

ఇక మంచు లక్ష్మి వాళ్ళతో వంట చేయించి ఎన్నో విషయాలు కూడా అడిగి తెలుసుకుంది. "కుకింగ్ వచ్చా" అని నిహారికను లక్ష్మి అడిగేసరికి "ఫుట్ బాల్ ఆడతా వెజిటబుల్స్ తో" అని ఆన్సర్ ఇచ్చింది నిహారిక. "అవునా సరే మీ ఆయన్ని అడిగితే తెలిసిపోతుందిగా" అని చైతన్యకు ఫోన్ చేసింది మంచు లక్ష్మి. మరి అటు నుంచి "హలో" అని వినిపించింది కానీ ఆ వాయిస్ ఎవరిదో మాత్రం అర్ధం కాలేదు. ఇంతలో కాలభైరవని షోలోకి ఇన్వైట్ చేసింది. "ఏమిటి ఈ పేరు.. మీ పేరెంట్స్ కి ఇంకా మంచి పేరు దొరకలేదా" అని ఫన్నీగా అడిగింది లక్ష్మి. ఇక ఇద్దరితో కలిసి దోశలు వేయించింది.

నిహారిక దోశ చాలా క్యూట్ గా వచ్చిందని కాంప్లిమెంట్ ఇచ్చింది. అమ్మేస్తే బోల్డు డబ్బులు వస్తాయి అని లక్ష్మి అనేసరికి డబ్బులు రావడం విషయం కాదు పరువు పోకుండా ఉండాలి అది ఇంపార్టెంట్ అంది. లక్ష్మి నవ్వేసింది. చివరికి నిహారిక ఒక అద్దిరిపోయే డిష్ చేసింది. దాన్ని ముగ్గురూ ఆస్వాదిస్తూ తిన్నారు. "థిస్ ఈజ్ ది రియల్ గుడ్ ఫుడ్ కుకింగ్ షో" అని ఫైనల్ టచ్ ఇచ్చేసింది మంచు లక్ష్మి. ఇక ఈ ఎపిసోడ్ అక్టోబర్ 14 న ఆహాలో స్ట్రీమ్ కాబోతోంది.