English | Telugu

వైల్డ్ కార్డ్ ఎంట్రీతో సుడిగాలి సుధీర్!

బిగ్ బాస్ సీజన్ 6 ఇరవై మంది కంటెస్టెంట్స్ తో మొదలైంది. ఇందులో ప్రతి వారం ఒక్కొక్కరుగా బయటికి వస్తోన్నారు. అయితే ప్రతి సీజన్లో వైల్డ్ కార్డు ఎంట్రీగా ఎవరో ఒకరు వస్తుంటారు అనేది అందరికి తెలిసిందే. కాగా ఈ సీజన్ లో ఇప్పటి వరకు వైల్డ్ కార్డ్ ఏంట్రీగా ఎవరు రాలేదు. అయితే ఈ మధ్య 'సుడిగాలి సుధీర్' వైల్డ్ కార్డు ఎంట్రీగా వస్తున్నాడన్న ప్రచారం జోరుగా చక్కర్లు కొడుతోంది. కాగా ఇప్పటివరకు అధికారంగా ఈ సీజన్లో వైల్డ్ కార్డు ఎంట్రీ ఉందని చెప్పిన, అలా ఏమి జరుగలేదు.

ఇప్పడు మాత్రం కచ్చితంగా బిగ్ బాస్ లోకి ఎవరో ఒకరు ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ప్రచారం. రెండు నెలలుగా బుల్లితెరలో కనిపించకుండా పోయిన జబర్దస్త్ హీరో సుడిగాలి సుధీర్, బిగ్ బాస్ లోకి వెళ్తున్నాడేమోనని సమాచారం. అయితే సుధీర్ జబర్దస్త్ లో కనిపించకుండా పోవడానికి కారణం, ఒక టీవీ యాజమాన్యం వారు భారీ ఖర్చుతో నిర్విహించే ఒక ప్రోగ్రాంకి భారీ పారితోషకం ఇచ్చి ఒప్పందం కుదుర్చుకొన్నారంట. అయితే ఆ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అవ్వడంతో సుధీర్ కాళీగా ఉన్నట్లు తెలుస్తోంది. అతడు జబర్దస్త్ ని వదిలి రావడానికి ఆ టీవి వాల్లే కారణం. అందుకే సుధీర్ ని బిగ్ బాస్ లోకి పంపిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హౌస్ లో గీతు, రేవంత్, ఆదిరెడ్డి, శ్రీహాన్ వీళ్ళు మాత్రమే స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ గా ఉన్నారు. కాగా కమెడియన్ గా వచ్చిన చలాకీ చంటి, హౌస్ లో ఎలాంటి ఎంటర్టైన్మెంట్ ఇవ్వలేకపోయాడు. ఒక ఫైమా తప్ప హౌస్ లో ఎవరు కామెడి పండించలేకపోతున్నారనేది అందరికీ తెలిసిందే. ఈ సీజన్ లో టాస్క్ లు, నామినేషన్లు మినహాయించి ప్రేక్షకులకు మాత్రం కాస్త బోర్ అనే చెప్పాలి. అందుకే బిగ్ బాస్ హౌస్ లో ఉత్సాహాన్ని నింపడానికి సుడిగాలి సుధీర్ ని పంపిస్తారేమోనని అనుకొంటున్నారు.

సుధీర్ ఎంట్రీ నిజం అయితే, ఈ సీజన్ విన్నర్ అతనే అవుతాడనే నెటిజన్లు అనుకొంటున్నారు. అయితే వచ్చే వారంలో సుధీర్ ఎంట్రీ ఉండబోతుందట. కాగా ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో చూడాలి మరి.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.