English | Telugu
ఎవిక్షన్ పాస్ తిరిగిచ్చేసిన యావర్.. ఫిధా అయిన అభిమానులు!
Updated : Nov 19, 2023
బిగ్ బాస్ హౌస్‌లో ఎవిక్షన్ పాస్ ఎంత కీలకమో అందరికి తెలిసిందే. ఎవిక్షన్ పాస్ తో నామినేషన్‌లో ఉన్న ఎవరినైన సేవ్ చేయొచ్చు లేదా డేంజర్ జోన్‌లో ఉంటే తమని తాము సేవ్ చేసుకోవచ్చు. దీనికోసం బిగ్ బాస్ ఎన్నో టాస్క్‌లని కంటెస్టెంట్స్ చేత ఆడిరచాడు. బిగ్ బాస్ సీజన్-7 ఇప్పటికే పది వారాలు పూర్తి చేసుకుంది. ఇక పదకొండవ వారం హౌస్‌లో ఎవరు ఎలిమినేషన్ అవుతారనే క్యూరియాసిటి అందరిలో మొదలైంది. అయితే నిన్న జరిగిన శనివారం నాటి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
శుక్రవారం వారం నాడు హౌస్‌లో ఏం జరిగిందో ప్రేక్షకులకు నాగార్జున చూపించాడు. అయితే నాగార్జున రావడం రావడమే ఫుల్ ఫైర్ మీద కన్పించాడు. షుగర్ తో చేసిన బాటిల్స్ తీసుకొని వచ్చి ఒక్కో కంటెస్టెంట్ తల మీద ఆ బాటిల్ పగులగొట్టి వార్నింగ్ ఇచ్చాడు నాగార్జున. మొదట కొత్త కెప్టెన్ ప్రియాంకని అభినందించాడు. ఆ తర్వాత అంబటి అర్జున్‌ని లేపి నిజాలు మాట్లాడమని చెప్పాడు. ఆ రోజు టాస్క్‌లో ఎవరు గెలిచారని అడిగాడు. రూల్స్ ప్రకారం ప్రియాంక గెలిచిందని అంబటి అర్జున్ అనగా.. బాల్స్ కిందపడితే అవుట్ కదా రూల్.. మరి గేమ్ లో ప్రియాంక విల్లుమీద ఉన్న బాల్స్ కిందపడిపోతే అవుట్ అనే కదా తను తప్పుకుందని నాగార్జున అన్నాడు. ఆ తర్వాత అందరికి ఒక క్లారిటీ ఇచ్చాడు నాగార్జున.
ఇక యావర్, అంబటి అర్జున్ మధ్య జరిగిన బాల్స్ బ్యాలెన్స్ టాస్క్‌లో ఏం జరిగిందనే ఫుటేజ్ ని బిగ్ స్క్రీన్ మీద వేసి చూపించాడు. ఇక బాల్ పైన పెట్టేప్పుడు యావర్ కాలు నేలమీద ఉందని స్పష్టంగా ఉందని నాగార్జున చెప్పాడు. మరి నువ్వు ఫౌల్ ఆడావ్ కదా యావర్ అని నాగార్జున అనగానే సారీ సర్.. నేను అది గమనించలేదు. కానీ ఫౌల్ గేమ్ ఆడి నేను గెలిచాను కాబట్టి ఈ ఎవిక్షన్ పాస్‌కి అన్ డిజర్వింగ్ అని యావర్ చెప్పి దానిని తిరిగి ఇచ్చేశాడు. దీంతో హౌస్ లోని వాళ్ళంతా షాక్ అయ్యారు. అంబటి అర్జున్ ఇన్ని రోజులు ఫేక్‌గా నటించావ్. ఫ్యామిలీ వీక్‌లో మీ భార్య చెప్తేనే నిజంగా ఉన్నావని నాగార్జున అన్నాడు. ఆ తర్వాత పల్లవి ప్రశాంత్, రతిక, గౌతమ్‌లు చేసిన తప్పులకి వార్నింగ్ ఇచ్చాడు. ఇలా ఈ వారం కంటెస్టెంట్స్ ఆడిన ఆటతీరుని ప్రశ్నిస్తూ గట్టి వార్నింగ్ ఇచ్చాడు. నామినేషన్‌లో ఉన్న శోభాశెట్టి, గౌతమ్ కృష్ణ, అశ్వినిశ్రీ, రతిక ఈ వారం డేంజర్ జోన్‌లో ఉన్నారు. మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలియాలంటే ఆదివారం నాటి పూర్తి ఎపిసోడ్ వచ్చేవరకు ఆగాల్సిందే.