English | Telugu

డబుల్ ఎలిమినేషన్.. కంటెస్టెంట్స్ షాక్!

బిగ్ బాస్ సీజన్-7 ‌నిన్నటి ఆదివారం నాటి ఎపిసోడ్‌లో ఎవరు ఊహించని విధంగా బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చాడు. ఇప్పుడు హౌస్ లో పదిమంది కంటెస్టెంట్స్ ఉండగా ఎవరినో ఎలిమినేషన్ చేస్తారో అనుకున్నారంతా కానీ నో ఎలిమినేషన్ అంటూ బిగ్ ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్.

సండే ఫండే అంటూ నాగార్జున వచ్చేశాడు. కంటెస్టెంట్స్ కి వచ్చీ రాగానే.. ఆడ్ ఏ ఫ్రెండ్, బ్లాక్ ఏ ఫ్రెండ్ అని రెండు ట్యాగ్ లు మీతోటి హౌస్ మేట్స్ కి ఇవ్వాలని నాగార్జున చెప్పాడు. అంటే హౌస్ లో ఎవరిని మీరు ఫ్రెండ్ గా కలుపుకోలవానుకుంటున్నారు. ఎవరిని డిలీట్ చేయాలనుకుంటున్నారని కంటెస్టెంట్స్ తో నాగార్జున చెప్పాడు. పల్లవి ప్రశాంత్ ని కొత్త స్నేహితుడిగా చేర్చుకున్నాడు అమర్ దీప్. వచ్చిన కొత్తలో అసలేం తెలియలేదు. ఇప్పుడు బాగా కలిసిపోయాడు.

అందుకనే నాకు మంచి ఫ్రెండ్ అవుతాడని చేసుకుంటున్నాని అమర్ దీప్ చెప్పి ఫ్రెండ్ షిప్ బ్యాండ్ ని తొడిగాడు. రతికకి బ్లాక్ ఏ ఫ్రెండ్ స్టాంప్ ఇచ్చాడు అమర్ దీప్. మొన్నటి వరకు నామినేషన్ లో చెప్పేవాడు ఇప్పుడు అలా లేడు. బాగా కలిసిపోతు‌న్నాడు అందుకే ఫ్రెండ్ పల్లవి ప్రశాంత్ ఫ్రెండ్ అని గౌతమ్ అన్నాడు. అంబటి అర్జున్ శివాజీకి ఆడ్ ఏ ఫ్రెండ్ ట్యాగ్ ఇచ్చాడు. తెలిసో తెలియకో నువ్వు ఫౌల్ చేశావ్ అది ఇంకోసారి రిపీట్ కాకూడదని బ్లాక్ స్టాంప్ ని యావరకి ఇచ్చాడు అంబటి అర్జున్. పల్లవి ప్రశాంత్ కి ఆడ్ ఏ ఫ్రెండ్ ట్యాగ్, అశ్వినిశ్రీ కి బ్లాక్ ఏ ఫ్రెండ్ స్టాంప్ ఇచ్చింది ప్రియంక జైన్. ఈ మధ్య తను మాతో కలుస్తుందని అశ్వినిశ్రీకి ఆడ్ ఏ ఫ్రెండ్ ట్యాగ్ ని ఇచ్చింది శోభాశెట్టి. మొన్నటి గేమ్ లో అమర్ దీప్ ని టార్గెట్ చేసి గౌతమ్ ఆడటం నాకు నచ్చలేదని శోభాశెట్టి చెప్పి అతనికి బ్లాక్ ఏ ఫ్రెండ్ స్టాంప్ ఇచ్చింది.

అంబటి అర్జున్ కి ఆడ్ ఏ ఫ్రెండ్ ట్యాగ్ ని ఇచ్చాడు శివాజీ‌. రతికని ఫ్రెండ్ గా బ్లాక్ చేస్తున్నాను కానీ బిడ్డగా ఎప్పుడు నాతోనే ఉంటుందని శివాజీ బ్లాక్ ఏ ఫ్రెండ్ స్టాంప్ ని ఇచ్చాడు. ఆ తర్వాత నాగార్జున కొన్ని గేమ్స్ ఆడిస్తూ, ఒక్కొక్కరిని సేవ్ చేసుకుంటూ వచ్చాడు. చివరగా అశ్వినిశ్రీ, గౌతమ్ కృష్ణ ఉన్నారు. నో ఎలిమినేషన్ ట్విస్ట్ ఇస్తూ వీరిద్దరిని సేవ్ చేశాడు నాగార్జున. ఇప్పుడు ఎలిమినేషన్ లేదు కాబట్టి తర్వాతి వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని అది ఎప్పుడు? ఏంటనేది బిగ్ బాస్ మీకు‌ చెప్తాడని కంటెస్టెంట్స్ తో నాగార్జున అన్నాడు. దీంతో కంటెస్టెంట్స్ తో పాటు అభిమానులు షాక్ అయ్యారు.