English | Telugu
Karthika Deepam2 : కాశీ, స్వప్నల పెళ్ళి.. దీప చేస్తుందా మరి!
Updated : Sep 25, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -158 లో.. దీపని కలవడానికి ఇంటికి వస్తాడు కాశీ. దీప దగ్గరికి వెళ్తుంటే పారిజాతం చూస్తుంది. వీడేంటి నా దగ్గరికి రాకుండా దీప దగ్గరికి వెళ్తున్నాడు. దీప అసలు విషయం చెప్తే అల్లుడు గారి రెండో పెళ్లి గురించి బయటపడి జ్యోత్స్న పెళ్లి ఆగిపోతుందని పారిజాతం కంగారుగా కాశీ వెనకాలే వెళ్తుంది.. కాశీ దీప దగ్గరికి వెళ్లి స్వప్న పెళ్లి రేపే.. నువ్వు ఎలాగోలా ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయాలని కాశీ అంటాడు.
పారిజాతం రావడం గమనించిన దీప.. మీ నానమ్మ వస్తుందని చెప్తుంది. ఏంటిరా కాశీ నా దగ్గరికి రాకుండా ఇక్కడికి వచ్చావని అడుగుతుంది. ఆఫీస్ లో భోజనం ఉంది కాటరింగ్ కోసం వచ్చానని చెప్తాడు. అక్క రేపు గుర్తు పెట్టుకో అని దీపకి చెప్పి కాశీ వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఈ ప్రాబ్లమ్ ని నేనే సాల్వ్ చెయ్యాలని దీప అనుకొని సుమిత్ర దగ్గరికి వెళ్లి రేపు గుడికి వెళదామని చెప్తుంది. దానికి సుమిత్ర సరే అంటుంది. మరుసటి రోజు ఉదయం స్వప్నని పెళ్లికి రెడి చేస్తారు. నాకు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని స్వప్న అంటుంటే.. నీ కోసం వాడు పెళ్లి దగ్గరికి వచ్చినా.. వాడు ఉండడని శ్రీధర్ బెదిరిస్తాడు. ఆ తర్వాత సుమిత్ర గుడికి వెళ్లి దీప కోసం వెయిట్ చేస్తుంది. అప్పుడే శ్రీధర్ వాళ్ళు కూడా గుడికి వస్తారు. దీపకి సుమిత్ర ఫోన్ చేసి అక్కడ ఉండండి వస్తున్నామని చెప్తుంది. సుమిత్రని చూసిన శ్రీధర్ లోపలికి వెళ్లకుండా స్వప్న కావేరిలని లోపలికి పంపిస్తాడు. కావేరి లోపలికి వెళ్లి పెళ్లి కొడుకు దగ్గర స్వప్నని ఉంచి శ్రీధర్ కోసం మళ్ళీ బయటకు వస్తుంది. శ్రీధర్ ని ఎక్కడ సుమిత్ర చూస్తుందోనని చాటున ఉంటాడు.
ఆ తర్వాత కాశీ, దీపలు స్వప్న దగ్గరికి వెళ్తారు. ఆ అబ్బాయితో నేను నిన్ను చేసుకోనని స్వప్న చెప్తుంది. దాంతో ఆ అబ్బాయి శ్రీధర్ కీ ఫోన్ చేస్తుంటే.. వీడు కాసేపు ఆగలేడా అని శ్రీధర్ ఫోన్ కట్ చేస్తాడు. ఆ తర్వాత స్వప్న తన ప్రేమ గురించి దీపకి చెప్తుంది. ఫోన్ లిఫ్ట్ చేయలేదా? సరే ఇక బయల్దేరు.. ఈ పెళ్లి జరగదని దీప అనడంతో.. శ్రీకాంత్ రగిలిపోతూ తన ఫోన్ విసిరికొట్టి.. ఛ అమ్మాయి పోయింది. ఆస్తీ పోయింది.. నేనే వెర్రి పుష్పాన్ని అయ్యానని అనుకుంటూ పోతాడు. స్వప్న చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మా డాడీని ఎలా ఆపావో నాకు తెలియదు కానీ.. థాంక్స్ దీపా.. కానీ ఈ రోజు పెళ్లి ఆగిందని సంతోషంగా లేదు.. మా డాడీ రేపు అయిన ఆ శ్రీకాంత్‌ని ఒప్పించి మా పెళ్లి చేసేస్తారు దీప అని స్వప్న అంటుంది. మరి దీనికి పరిష్కారం ఏంటని దీప అనగా.. మా పెళ్లి కావడమే దీనికి పరిష్కారం అక్కా అని కాశీ అంటాడు. దీప షాక్ అవుతుంది.