English | Telugu
Eto Vellipoyindhi Manasu : ఆమె మనసులో మాట చెప్పగలదా!
Updated : Aug 22, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -181 లో... రామలక్ష్మి దగ్గరికి సీతాకాంత్ వచ్చి.. నాకు మర్చిపోలేని గిఫ్ట్ ఇస్తాను అన్నావ్.. ఏంటి అది అని అడుగుతాడు. ముందు మీరు చెప్పండి మీ మనసులో మాట చెప్తాను అన్నారు కదా అని రామలక్ష్మి అంటుంది. ఆ తర్వాత రామలక్ష్మి కళ్ళు మూసుకుంటుంది. సీతాకాంత్ తను తెచ్చిన రింగ్ ని పట్టుకొని రామలక్ష్మి కి ప్రపోజ్ చేస్తుంటే.. అప్పుడే నందిని వస్తుంది. తనని చూసిన సీతాకాంత్ షాక్ అవుతాడు. రామలక్ష్మి కళ్ళు తెరిచి ఏమైందని అడుగుతుంది.
నందినిని చూసి మేడమ్ అని అనగానే.. అంటే నువ్వు చెప్పిన మేడం తనేనా అని రామలక్ష్మితో సీతాకాంత్ అంటాడు. అవునని రామలక్ష్మి వెళ్లి నందినిని రిసీవ్ చేసుకుంటుంది. సీతాకాంత్ మాత్రం నందినిని షాకింగ్ గా చూస్తుంటాడు. హ్యాపీ బర్త్ డే సీతాకాంత్ అంటూ నందిని షేక్ హ్యాండ్ ఇస్తుంది. అందరికి ఒక విషయం చెప్పాలని అందరి ముందుకి వచ్చి.. సీతాకాంత్ చాలా గొప్పవారు తనతో కలిసి పార్టనర్ గా ఉండడం అనేది చాలా హ్యాపీగా ఉంది. దీనికి కారణం రామలక్ష్మి అని అందరి ముందు రామలక్ష్మికి నందిని థాంక్స్ చెప్తుంది. ఇక నాకు వర్క్ ఉంది అంటూ అక్కడ నుండి వెళ్లిపోతుంటుంది. మేడమ్ మాకు ఇచ్చిన మాటేంటి అని సందీప్ వెనకాలే వెళతాడు. అయినా సందీప్ ని పట్టించుకోకుండా వెళ్లిపోతుంది. మరొకవైపు సుజాత వెళ్ళిపోతూ.... అల్లుడు గారు నిన్ను బాగా చూసుకుంటున్నారు.. చాలా హ్యాపీగా ఉంది.. మీరు ఇంకా హ్యాపీగా ఉండాలంటే నీ కడుపు పండాలని రామలక్ష్మికి సుజాత చెప్తుంది. ఆ తర్వాత సీతా సర్ కన్పించడం లేదని రామలక్ష్మి చూస్తుంది. సీతా తన మనసులో మాట చెప్పడానికి సర్ ప్రైజ్ ప్లాన్ చేసి ఉంటాడని పెద్దాయన అనుకుంటాడు.
మరొకవైపు అ మేడమ్ ఇలా చేసిందని శ్రీలతతో సందీప్ అంటాడు. ముందు అ నందిని సీతకు ఏమవుతుందో తెలుసుకోవాలి.. ఎందుకంటే తను రాగానే సీతా చేంజ్ అయ్యాడు. ఒక్క మాట కూడా మాట్లాడలేదని శ్రీలత కి డౌట్ వస్తుంది. ఆ తర్వాత రామలక్ష్మి తన గదిలోకి వెళ్తుంది. ఈ రోజు ఎలాగైనా సీతా సర్ కి నా మనసులో మాట చెప్పి అయన సొంతం అవుతానని రామలక్ష్మి అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.